ఇటు తెలుగు,అటు త‌మిళ స్టార్ హీరోతో పోటీ ప‌డ‌నున్న సూర్య‌

Sun,April 14, 2019 12:21 PM
three heroes big fight on may 31

త‌మిళ స్టార్ హీరో సూర్య న‌టించిన చిత్రాల‌కి ప్రేక్ష‌కాద‌ర‌ణ భారీగానే ఉంటుంది. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం ఎన్‌జీకే( నంద గోపాల‌న్ కుమార‌న్‌). సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సూర్య 36వ చిత్రం కాగా, మూవీకి సంబంధించి విడుద‌లైన టీజ‌ర్స్, సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. మే 31న ఎన్‌జీకే చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ఇటీవ‌ల చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అయితే అదే రోజు విజ‌య్ దేవ‌ర‌కొండ డియ‌ర్ కామ్రేడ్ చిత్రం కూడా రిలీజ్ అవుతుంది. ఈ చిత్రం సౌత్‌లోని నాలుగు భాష‌ల‌లో విడుద‌ల కానుంది. మ‌రో వైపు హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న ‘కదరం కొండన్’ అనే చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. రాజేష్ ఎమ్ సెల్వ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ పోలీస్ గా నటిస్తున్నాడు. అక్షరా హాసన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మే 31న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. ఈ మూవీ కూడా తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల కానున్నట్టు స‌మాచారం. అంటే సూర్య‌, విక్ర‌మ్, విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలు ఒకే రోజు రెండు భాష‌ల‌లో విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర గ‌ట్టి పోటీ ఎదుర్కొన‌నున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. మ‌రి ఈ పోటీలో గెలుపెవ‌రిదో చూడాలి.

2590
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles