మా ఇద్దరి కెమిస్ట్రీ బాగుందంటున్నారు..

Wed,February 14, 2018 10:43 PM
tholi prema movie success meet


హైదరాబాద్ : బాపినీడు స‌మ‌ర్పణలో ఎస్‌.వి.సి.సి బ్యాన‌ర్‌పై వ‌రుణ్ తేజ్‌, రాశీ ఖ‌న్నా జంట‌గా న‌టించిన సినిమా తొలి ప్రేమ‌. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ సక్సెస్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. చిత్ర నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమాను నమ్మి చేశాను. ఈ చిత్రానికి న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు అందరూ బాగా సెట్ అయ్యారన్నారు.

హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ప్రతీ టెక్నీషియ‌నూ త‌మ వంతుగా ఈ సినిమాకు అత్యుత్తమంగా కృషి చేశారు. వెంకీ ఒక రోజు నా ముందు కూర్చుని ఈ క‌థ‌ను ప్రసాద్ గారితో చేయ‌డానికి సిద్దమైనట్లు చెప్పారు. నేను స‌రేన‌నుకున్నా. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వెయిటింగ్‌లో ఉన్నపుడు ప‌డే ఆవేద‌న నాకు తెలుసు. ఎమోష‌న్స్, రిలేష‌న్స్ నాకూ బీవీయ‌స్‌య‌న్ కుటుంబానికి మ‌ధ్య బాగా ఉన్నాయి. అందుకే ఈ సినిమా మ‌ర‌లా నా చేతుల్లోకి వ‌చ్చింది. క‌రుణాక‌ర‌న్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ గారితో `తొలిప్రేమ‌`ను క్రియేట్ చేస్తే, ఇప్పుడు వెంకీ అట్లూరి మ‌ర‌లా క్రియేట్ చేశారు. ఫిదా త‌ర్వాత వ‌రుణ్ తేజ్ మరోసారి ఈ సినిమాలో చాలా బాగా చేశారు. మూడు పాత్రల్లో త‌ను చూపించిన వైవిధ్యం అంద‌రినీ మెప్పించిందన్నారు. డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ నా తొలి ప్రయత్నాన్ని ఆద‌రించినందుకు ధ‌న్యవాదాలు. కెమెరామెన్ జార్జి నాకు చాలా స్పెష‌ల్‌. ఈ సినిమాకు చాలా కష్టపడ్డారు. రాశీని ఈ సినిమాలో చూసిన వారంద‌రూ ఇంట్లో అమ్మాయిలా ఇష్టపడుతుండటం నాకు చాలా బాగా న‌చ్చింది. వ‌రుణ్ నమ్మడం వల్లే ఈ సినిమా పురుడుబోసుకుందన్నారు.

హీరోయిన్ రాశీఖ‌న్నా మాట్లాడుతూ ఈ సినిమాకు వ‌చ్చిన రివ్యూల‌న్నీ చ‌దివాను. ట్విట్టర్ లోనూ న‌న్ను వ‌ర్ష అని పిలుస్తున్నారు. ఈ అవ‌కాశం ఇచ్చిన వెంకీ అట్లూరికి ధ‌న్యవాదాలు. ఈ సినిమాతో నాకు ఫీమేల్ ఫ్యాన్స్ కూడా పెరిగారు. టీమ్ అంతా క‌ష్టపడి ప‌నిచేశాం. రిపీటెడ్ ఆడియ‌న్స్ వ‌చ్చి మా సినిమాను చూస్తుంటే ఆనందంగా ఉందని చెప్పింది.

వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ ఈ సినిమా క‌థ‌ని అందరూ న‌మ్మి చేశారు. అంద‌రిక‌న్నా ముందు దిల్‌రాజుగారు న‌మ్మారు. అట్లూరి వెంకీకి నేను రుణ‌ప‌డి ఉంటాను. వెంకీ చాలా ఇష్టపడి చేసుకున్న స‌బ్జెక్ట్ ఇది. ఆద్యంతం క‌న్విక్షన్ ఉంటుంది. కొత్త డైరెక్టర్ ఇంత బాగా చేశారా అని చిరంజీవిగారు షాక్ అయ్యారు. సినిమా విడుద‌ల‌య్యాక నాది, రాశీ ఖ‌న్నాది ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బావుంద‌ని చాలా మంది అంటున్నారు. ఆఫ్ స్క్రీన్ జార్జి, త‌మ‌న్‌, వెంకీ అట్లూరి మ‌ధ్య బాండింగ్ చాలా బావుంటుంది. సినిమాను వారు ప్రేమించిన విధానం, చేసిన హార్డ్ వ‌ర్క్ ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. ప్ర‌తి టెక్నీషియ‌న్ చాలా బాగా చేశారు`` అని చెప్పాడు.

2693
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles