వ‌రుణ్ ధావ‌న్‌ని ర‌ణ‌బీర్ అనేసిన అలియా భ‌ట్

Tue,April 16, 2019 10:44 AM
This video of Alia Bhatt accidentally calling Varun Dhawan as Ranbir

ప్ర‌స్తుతం బిజీయెస్ట్ హీరోయిన్స్‌లో అలియా భ‌ట్ ఒక‌రు. హిందీలో క‌ళంక్, బ్ర‌హ్మాస్త్రా చిత్రాల‌తో పాటు తెలుగులో ఆర్ఆర్ఆర్ అనే భారీ బ‌డ్జెట్ చిత్రం చేస్తుంది. అలియా. ఎమ్‌సీఏ ఫేమ్ శ్రీరామ్‌వేణు దర్వకత్వంలో ఐకాన్-కనబడుటలేదు పేరుతో ఓ చిత్రం తెరకెక్కనున్న చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడీగా అలియాభట్ నటించనున్నట్లు సమాచారం. అయితే ప్ర‌స్తుతం తాను త‌న కోస్టార్స్ వ‌రుణ్ ధావ‌న్, సోనాక్షిసిన్హా, ఆదిత్య రాయ్ క‌పూర్‌తో క‌లిసి క‌ళంక్ చిత్ర ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉంది. ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇంట‌ర్వ్యూ జ‌రుగుతున్న స‌మ‌యంలో అలియా ప‌క్క‌న కూర్చున్న వ‌రుణ్ ధావ‌న్ .. అలియా జుట్టు ముడిని ప‌ట్టుకొని లాగాడు. ఆ స‌మ‌యంలో అలియా.. ర‌ణ... ఊ.. వ‌రుణ్ అలా చేయ‌కు అని అంది. అయితే క‌న్ఫ్యూజ‌న్‌లో వ‌రుణ్ ధావ‌న్ పేరుకి బ‌దులుగా త‌న బాయ్ ఫ్రెండ్ పేరు అలియా ప‌ల‌క‌డంతో అక్క‌డ ఉన్న వారందరు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. బాలీవుడ్ క్యూటెస్ట్ క‌పుల్ ర‌ణ‌బీర్ క‌పూర్, అలియా భ‌ట్‌లు కొన్నాళ్ళుగా ప్రేమాయ‌ణంలో ఉండ‌గా, వ‌చ్చే ఏడాది వీరిరివురు వివాహం చేసుకోనున్న‌ట్టు తెలుస్తుంది.

1226
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles