ఈ సారి ప‌ది ల‌క్ష‌లు ఆఫర్ చేసిన వ‌ర్మ‌

Wed,October 17, 2018 09:24 AM
this time varma offers 10 lakhs

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తాను ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని దసరా (విజయదశమి) రోజు లాంచ్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ గారి మీద గౌరవంతో తిరుమల శ్రీవారి పాదాల చెంత అక్టోబర్ 19న సినిమా లాంచింగ్ నిర్వహిస్తామన్నారు. జ‌న‌వ‌రి నెలాఖ‌రుకి సినిమా విడుద‌ల చేస్తాన‌ని చెప్పుకొచ్చారు. అయితే త‌న సినిమాలోని పాత్ర‌ల‌కి ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యే వాళ్ళ‌ని ఎంపిక చేసుకునే వ‌ర్మ .. చంద్ర‌బాబుగా హోట‌ల్‌లో వ‌డ్డించే వ్య‌క్తిని ఇటీవ‌ల‌ ఎంపిక చేసుకున్నాడు. ఆ వ్య‌క్తి వివ‌రాలు అందించినందుకు గాను ఓ ప్ర‌ముఖ ఛానెల్‌కి సంబంధించిన ముత్యాల రోహిత్ అనే యువ‌కుడికి ల‌క్ష రూపాయ‌లు అందించాడు.

తాజాగా తాను ఎన్టీఆర్ పాత్ర‌ల‌కి ఇద్ద‌రు ముగ్గురిని ఎంపిక చేసుకున్నాన‌ని చెప్పిన వ‌ర్మ‌.. ల‌క్ష్మీ పార్వ‌తిని ఎన్టీఆర్ క‌లుసుకున్న‌ప్పుడు ఎలా ఉన్నారో.. అలాంటి పోలిక‌లు ఉన్న వ్య‌క్తిని క‌నుగొని వారి వివ‌రాలు నాకు తెలియ‌జేస్తే ప‌ది లక్ష‌ల‌ని బ‌హుమ‌తిగా ఇస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఆ వ్య‌క్తి వివ‌రాలు laksmisntr@gmail.comకి పంపించండి అని కోరాడు వ‌ర్మ‌. ప్ర‌తి సినిమాని వైవిధ్యంగా ప్ర‌మోట్ చేసుకునే వ‌ర్మ ఇప్పుడుఈ సినిమా కోసం ఆయ‌న చేస్తున్న‌ స్ట్రాట‌జీలు అభిమానుల‌కి కొత్త‌గా అనిపిస్తున్నాయి. ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌, ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి జీవితం ఆధారంగా వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాను తీయ‌నున్న సంగ‌తి తెలిసిందే. చిత్రాన్ని లక్ష్మీ పార్వతి దృష్టికోణం నుంచి ఎన్టీఆర్‌ను చూపించబోతున్నట్లు తెలిపారు. రాకేష్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను జీవీ ఫిల్మ్స్‌ పతాకంపై బాల గిరి సమర్పిస్తున్న విష‌యం విదిత‌మే.

3058
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles