ప్రియా వారియర్ పరువు తీసిన పాట ఇది.. వీడియో

Fri,September 21, 2018 03:38 PM
This song of Priya Prakash Varrier is getting most dislikes on Youtube here is why

ప్రియా ప్రకాశ్ వారియర్ మీకు గుర్తుందా.. అప్పట్లో ఓ కన్ను గీటి దేశాన్నంతా తన వైపునకు తిప్పుకున్న కేరళ కుట్టి ఈమె. ఒరు అదార్ లవ్ మూవీలోని ఓ సాంగ్‌లో క్లాస్‌రూమ్‌లో హీరోని చూసి ఆమె కన్ను గీటడం ఎంతో మంది యువకుల హృదయాలను కొల్లగొట్టింది. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ చూసి దేశమంతా ఫిదా అయింది. కొన్నాళ్ల పాటు ఇంటర్నెట్ సెన్సేషన్‌గా నిలిచింది. తాజాగా అదే మూవీలోని మరో సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నెల 20న ఆ కొత్త సాంగ్‌ను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఊహించినట్లే ఈ పాటకు కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం 15 గంటల్లోనే పది లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ముఖ్యంగా కేరళ యూత్‌ను ఈ పాట బాగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడీ పాటే ప్రియా ప్రకాశ్ పరువు తీసింది. ఈ మధ్య కాలంలో మోస్ట్ డిస్‌లైక్స్ వచ్చిన వీడియోగా ఈ పాట నిలిచింది. లైక్స్ కేవలం 39 వేలు ఉండగా.. డిస్‌లైక్స్ మాత్రం మూడు లక్షల వరకు రావడం మూవీ యూనిట్‌కు మింగుడు పడటం లేదు. అయితే ప్రస్తుతం ప్రియా ప్రకాశ్‌పై నడుస్తున్న వ్యతిరేక ప్రచారం వల్లే ఇన్ని డిస్‌లైక్స్ వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

5892
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS