బావను ఆటపట్టించిన పరిణీతి చోప్రా.. ఫోటో వైరల్

Wed,January 23, 2019 05:39 PM
This Pic Of Parineeti From Priyanka Chopra And Nick Jonas Haldi ceremony goes viral

ప్రియాంక పెళ్లి అయి చాలా రోజులు అయింది కదా. అంతా గప్‌చుప్.. వాళ్లు కూడా తమ పెళ్లి సంబురాలను మరిచిపోయి... ఎవరి పని వారు చేసుకుంటున్న సమయంలో ఒక్క ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది నిక్యాంక హల్దీ వేడుకల సమయంలో తీసిన ఫోటో. ప్రియాంక కజిన్ పరిణీతి చోప్రాదే ఆ ఫోటో. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నిక్యాంకకు హల్దీ సెరమనీ నిర్వహిస్తున్న సమయంలో నిక్‌కు.. పరిణీతి పసుపు పూస్తూ కాసేపు ఆట పట్టించింది. దానికి సంబంధించిన ఫోటోనే ఇది. పరిణీతి.. ప్రియాంకకు సోదరి వరుస అవుతుంది. అంటే ప్రియాంక భర్త నిక్.. పరిణీతికి బావ వరస అవుతాడు కదా. అందుకే.. బావను కాసేపు పరిణీతి ఆటపట్టించిందన్నమాట. తర్వాత పెళ్లి కూతురు ప్రియాంకతో కలిసి దిగిన పోటోను కూడా పరిణీతి షేర్ చేసింది.

View this post on Instagram

The girls 💛

A post shared by Parineeti Chopra (@parineetichopra) on


ప్రియాంక ప్రస్తుతం తన హాలీవుడ్ సినిమా ఈజింటిట్ రొమాంటిక్, బాలీవుడ్ సినిమా ది స్కై ఈజ్ పింక్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. నిక్యాంక పెళ్లి గత సంవత్సరం డిసెంబర్ 1, 2న హిందూ, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జోద్‌పూర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిక్యాంక లాస్ ఏంజెల్స్‌లో ఉన్నారు. వాళ్లు హనీమూన్‌కు కరీబియన్ దీవులకు వెళ్లారు. అంతకుముందు ఫ్యామిలీతో లండన్, స్విట్జర్లాండ్‌లో ఈ జంట పర్యటించింది.

4991
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles