‘‘ఈ పిక్ చాలు.. ఫలితం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవటానికి’’

Tue,December 11, 2018 04:28 PM
This Pic is enough to understand the results


తెలంగాణ ఎన్నిక‌ల్లో విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసిన టీఆర్ఎస్‌ పార్టీకి సినీ ప్ర‌ముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అంచనాలను తలకిందులు చేస్తూ రికార్డు స్థాయిలో భారీ మెజార్టీల‌తో టీఆర్ఎస్ అభ్య‌ర్థులు గెలుపొందారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌, కేటీఆర్‌లను అభినందిస్తూ సోషల్‌ మీడియాలో పంచ్ డైలాగ్‌ల‌తో అభినంద‌న‌లు తెలుపుతున్నారు. హీరోలు, సూప‌ర్ స్టార్ కృష్ణ‌, సుధీర్‌ బాబు, నాని, నిఖిల్‌, మంచు మనోజ్‌ల‌తో పాటు సినీ దర్శకులు హరీష్‌ శంకర్‌, గోపిచంద్‌ మలినేని, కోన వెంకట్ లాంటి సినీ ప్ర‌ముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

డైరెక్టర్ హరీష్ శంకర్ ప‌వ‌ర్‌ఫుల్ కామెంట్ చేశారు . ఫామ్ హౌస్‌లో ఉన్నారో.. ఫామ్‌లో ఉన్నారో తేల్చిచెప్పేసిన జనం.. ఇదీ ప్రజాస్వామ్యం పవరంటే.. అని ట్విట‌ర్‌లో వ్యాఖ్య‌నించారు.
'ఈ పిక్ చాలు.. ఫలితం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవటానికి' అని పేర్కొంటూ సినీ ప్రముఖులు కోన వెంకట్ ట్వీట్ చేశారు.


5242
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles