ఈ కేరళ టీచర్ పాట వింటే ఫ్లాటైపోతారు.. వీడియో

Wed,May 9, 2018 12:23 PM
This Kerala Teachers voice mesmerizing the netizens

తిరువనంతపురం: ఈ ఇంటర్నెట్ యుగంలో మీ టాలెంట్‌ను నిరూపించుకోవడానికి పెద్ద పెద్ద వేదికలే అవసరం లేదు. ఈ కేరళ సింగర్‌లాగా మీ ఇంట్లో జరిగే ఏ సెర్మనీలోనో ప్రూవ్ చేసుకోవచ్చు. లల్లూ అల్ఫోన్స్ అనే ఈ సింగర్ తన సోదరుడి పెళ్లిలో పాడిన పాట ఇప్పుడు యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నది. ఆమెను ఓవర్‌నైట్ ఇంటర్నెట్ స్టార్‌ను చేసేసింది. మార్ ఆగస్తినోజ్ కాలేజ్‌లో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న లల్లూ.. భూల్ భులయ్యా మూవీలోని మేరె ఢోల్‌నా సున్ అనే పాట పాడటం నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. నిజంగా ఒరిజినల్ సాంగ్ పాడిన శ్రేయా ఘోషాలే పాడిందా అన్నట్లు లల్లూ తన అద్భుమైన గాత్రంతో అలరించింది. గత నెలలో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 5 లక్షల మంది చూడటం విశేషం. ఓ మలయాళీ హిందీ సాంగ్‌ను ఇంత బాగా పాడటం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇదీ ఆ వైరల్ వీడియో..

7075
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles