శ్రీదేవి కోరిక మేరకే హ‌రిద్వార్‌లో అస్థిక‌ల నిమ‌జ్జ‌నం

Fri,March 9, 2018 02:03 PM
this is the reason for sridevi ash immersed in Haridwar

ఫిబ్ర‌వ‌రి 24న బాత్ ట‌బ్‌లో ప‌డి శ్రీదేవి హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. ఆమె మృతి కోట్లాది అభిమానుల‌కి శోక‌సంద్రాన్ని మిగిల్చింది. కుటుంబ స‌భ్యులు ఆమె లేద‌నే వార్త‌ని ఏ మాత్రం జీర్ణించులేకపోతున్నారు. శ్రీదేవి ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని బోని కపూర్ పూజలు చేస్తున్నారు. గ‌త‌వారం రామేశ్వ‌రంలో శ్రీదేవి అస్తిక‌ల‌ని క‌లిపిన బోని క‌పూర్ నిన్న హ‌రిద్వార్‌లోని గంగా న‌దిలో నిమ‌జ్జ‌నం చేశారు. ఈ విష‌యంపై బోని మీడియాతో మాట్లాడుతూ.. 1993లో ఓ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా శ్రీదేవి హ‌రిద్వార్ వెళ్లారు. ఆ టైంలో హ‌రిద్వార్‌ని ద‌ర్శించుకోవాల‌ని అనుకున్నా కుద‌ర‌లేదు. దాంతో మ‌ళ్ళీ వ‌స్తాన‌ని మొక్కుకున్నార‌ట‌. మ‌ళ్ళీ ఆ అవ‌కాశం శ్రీదేవికి ఎప్పుడు రాలేద‌ట‌. ఈ క్ర‌మంలో శ్రీదేవి కోరిక ప్రకారం ఆమె అస్థిక‌ల‌ని హారిద్వార్‌లోని గంగా న‌దిలో క‌లిపిన‌ట్టు చెప్పారు. హ‌రిద్వార్ వీఐపీ ఘాట్‌లో బోని ప‌లు పూజ‌లు కూడా చేసిన‌ట్టు తెలుస్తుంది. ఈ కార్య‌క్ర‌మానికి బోనీతో పాటు అనిల్‌కపూర్‌, కరణ్‌ జోహార్‌, ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రా, అమ‌ర్ సింగ్‌ కూడా వెళ్లారు.

2392
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles