రాకేష్ శ‌ర్మ బ‌యోపిక్ నుండి షారూఖ్ త‌ప్పుకోవ‌డానికి కార‌ణం ?

Sat,March 16, 2019 09:43 AM
this is the reason for sharukh rejected Rakesh Sharma biopic

అంత‌రిక్షంలోకి వెళ్లిన తొలి భార‌తీయ వ్యోమ‌గామి రాకేష్ శ‌ర్మ బ‌యోపిక్ తెర‌కెక్కించేందుకు బాలీవుడ్‌లో కొద్ది రోజులుగా స‌న్నాహాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. రాకేష్ శ‌ర్మ పాత్ర‌లో ముందుగా అమీర్ ఖాన్‌ని అనుకున్న‌ప్ప‌టికి త‌ర్వాత షారూఖ్ ఖాన్ ఫ్రేంలోకి వ‌చ్చాడు. షారూఖ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఈ బ‌యోపిక్ రూపొందుతుంద‌ని అంద‌రు భావిస్తున్న క్ర‌మంలో యురి స్టార్ విక్కీ కౌశ‌ల్ అన్నారు. తాజాగా ర‌ణ్‌బీర్ క‌పూర్‌ని ఎంపిక చేసిన‌ట్టు బాలీవుడ్ టాక్. అయితే రాకేష్ శ‌ర్మ బ‌యోపిక్ నుండి షారూఖ్ త‌ప్పుకోవ‌డానికి గ‌ల కార‌ణం ప్రముఖ రచయిత అంజుమ్‌ రాజబలి మీడియాకి తెలిపారు.

రాకేష్ శ‌ర్మ బ‌యోపిక్‌కి అంజుమ్ రాజ‌బ‌లి క‌థ రాస్తుండ‌గా, ఈ ప్రాజెక్ట్ నుండి షారూఖ్ త‌ప్పుకోవ‌డంపై ఆయ‌న‌ స్పందించారు. జోరో చిత్రం ఫ్లాప్ కావ‌డంతో షారూఖ్ షాక్ లో ఉన్నారు. మరో అంతరిక్ష నేపథ్యంలో సినిమా చేయాల‌నే ఉద్దేశంతో షారుక్‌ బయోపిక్‌ నుంచి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ అసలు కారణం అది కాదని అంజుమ్ అన్నారు. జీరో సినిమాకి ఇండ‌స్ట్రీలో టాలెంటెడ్ వ్య‌క్తి అయిన హిమాన్షు శ‌ర్మ క‌థ రాశారు. క‌త్రినా, అనుష్క వంటి స్టార్స్ న‌టించారు. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ రాకేశ్ ఓం ప్ర‌కాశ్ మెహ్రా చిత్రం తెర‌కెక్కించాడు. అయిన‌ప్ప‌టికి సినిమా ఫ్లాప్ అయిందంటే స్క్రిప్ట్‌లోనే ఏదో లోపం ఉండి ఉంటుంది అని అంజుమ్ అన్నారు .జీరో ఫ్లాప్ కావ‌డంతో షాక్ లో ఉన్న షారూఖ్‌, బయోపిక్‌పై శ్రద్ధ పెట్టలేక తప్పుకొన్నారని అంజుమ్ స్ప‌ష్టం చేశారు.

502
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles