నేనెప్పటికీ జైల్లోనే ఉంటాననుకున్నారా?

Wed,May 16, 2018 03:16 PM
This is how Salman Khan responds to a Journalists on Black Buck poaching case

కృష్ణజింకల వేట కేసులో సల్మాన్‌ఖాన్‌కు శిక్షపడటం చాలా మంది బాలీవుడ్ నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. సల్మాన్‌ని నమ్ముకొని అతనితో తీయబోయే సినిమాలపై భారీగా ఇన్వెస్ట్ చేశారు. అయితే సల్మాన్ మాత్రం ఈ శిక్షను లైట్ తీసుకున్నాడు. రేస్ 3 ట్రైలర్ రిలీజ్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఓ జర్నలిస్ట్ కృష్ణజింక కేసు విషయాన్ని లేవనెత్తాడు. దీనిపై అతను స్పందిస్తూ.. నేను మొత్తం జైల్లోనే ఉంటానని అనుకున్నారా అంటూ ప్రశ్నించాడు. దీనికి అలా ఏమీ లేదని ఆ జర్నలిస్ట్ చెప్పడంతో థ్యాంక్యూ.. మీరు అలాగే అనుకుంటున్నారేమోనని భయపడ్డాను అని సల్లూ భాయ్ అన్నాడు. అయితే అతని కామెంట్స్‌పై నెటిజన్లు మండిపడ్డారు. నువ్వు చెప్పింది కరెక్టే.. మన దేశంలో ఏం చేసైనా తప్పించుకోవచ్చు అంటూ ట్వీట్లు చేశారు.


3439
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles