ప్రభాస్‌కు వీరాభిమాని అయిన హాలీవుడ్ స్టార్!

Mon,April 16, 2018 12:40 PM
This Hollywood star is a big fan of Baahubali star Prabhas

సాధారణంగా హాలీవుడ్ స్టార్లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ఆ అభిమానుల లిస్ట్‌లో మన దేశానికి చెందిన బాలీవుడ్, టాలీవుడ్ స్టార్లు కూడా ఉంటారు. కానీ మన టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఓ హాలీవుడ్ స్టారే అభిమానిగా మారిపోయాడు. ఆ స్టార్ హీరో పేరు విన్‌స్టన్ డ్యూక్. ఈ మధ్యే ప్రపంచవ్యాప్తంగా సంచలన వసూళ్లు సాధించిన బ్లాక్ పాంథర్ మూవీలో ఎంబాకు రోల్ ప్లే చేశాడితడు. అయితే అంతటి హీరో కూడా రాజమౌళి బాహుబలి సినిమా చూసి బాగా ఇంప్రెస్ అయ్యాడట. నిజానికి తన చిన్నతనం నుంచీ బాలీవుడ్ సినిమాలు చూస్తుంటానని డ్యూక్ చెప్పాడు. లైవ్ విత్ కెల్లీ అండ్ రియాన్ షోలో పాల్గొన్న డ్యూక్ ఈ విషయాన్ని వెల్లడించాడు. టొబాగో ఉన్నపుడు చుట్టూ ఇండియన్స్ ఎక్కువగా ఉండేవాళ్లని అందుకే తాను కూడా బాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగానని చెప్పాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో బాహుబలి సినిమా పోస్టర్లు పోస్ట్ చేసి తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. బాహుబలి అధికార ట్విట్టర్ అకౌంట్ డ్యూక్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ను స్క్రీన్‌షాట్ తీసి పోస్ట్ చేసింది. తమపై చూపిన అభిమానానికి థ్యాంక్స్ చెప్పింది.


దీనికి డ్యూక్ కూడా స్పందించాడు. అంత మంచి సినిమా అందించినందుకు మీకే కృతజ్ఞతలు అంటూ డ్యూక్ ట్వీట్ చేశాడు.
బాక్సాఫీస్ వసూళ్లలో రికార్డులు కొల్లగొట్టిన బాహుబలి 2.. ఈ మధ్యే ప్రకటించిన నేషనల్ అవార్డుల్లోనూ సత్తా చాటింది. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, బెస్ట్ పాపులర్ మూవీ కేటగిరీల్లో అవార్డులు సొంతం చేసుకున్న విషయం తెలిసింది.

4853
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS