వైరలయిన మలయాళీ హీరోయిన్ మ్యారేజ్ డ్యాన్స్ వీడియో!

Wed,October 11, 2017 02:42 PM
వైరలయిన మలయాళీ హీరోయిన్ మ్యారేజ్ డ్యాన్స్ వీడియో!

'ఐయామ్ ఏ మల్లు'.. ఓ ఆల్బమ్ సాంగ్. సింగర్ రినోష్ జార్జ్ మలయాళీల కోసం పాడిన పాట ఇది. 2016లో రిలీజయిన ఈ పాట సోషల్ మీడియాలో అప్పట్లో బీభత్సం సృష్టించింది. ఇప్పుడు ఆ వీడియోకు మలయాళం హీరోయిన్ అశ్వతీ వారియర్ తన పెళ్లిలో డ్యాన్స్ వేసి అదరగొట్టింది. కాబోయే భర్త అబిలాష్ ఉన్నికృష్ణన్‌తో కలిసి అశ్వతీ ఐయామ్ మల్లు పాటకు డ్యాన్స్ వేసింది.

పెళ్లికి వచ్చిన అతిథులు, బంధువులు, స్నేహితులు అంతా కలిసి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుతో స్టెప్పులేశారు. ఇక.. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పుడది వైరలవడమే కాదు.. నెటిజన్ల నుంచి తెగ ప్రశంసలు కూడా అందుకుంటున్నది. పెళ్లిలో వైవిధ్యాన్ని ప్రదర్శించి పాత తరంనాటి సంప్రదాయాలను పక్కన బెట్టి అందరితో కలిసి ఎంజాయ్ చేసిన పెళ్లి కొడుకు, కూతురుకు హేట్సాఫ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇదే ఆ వీడియోఐయామ్ ఏ మల్లు ఒరిజినల్ వీడియో ఇది..

6352

More News

VIRAL NEWS