వీడియో.. ఇంటర్నెట్‌ను బ్రేక్ చేస్తున్న బాహుబలి డ్యాన్స్!

Tue,November 14, 2017 04:08 PM
This Bahubali dance video of Dance India Show breaking the Internet

బాహుబలి.. ఈ మూవీ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన ఘనత ఈ మూవీ సొంతం. ఈ సినిమా గురించి ఏ చర్చ అయినా అది అభిమానులకు ఆసక్తి కలిగించేదే. తాజాగా ఈ మూవీలోని జియో రె బాహుబలి సాంగ్‌పై ఓ గ్రూప్ చేసిన డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్నది. స్టార్ ప్లస్‌లో వచ్చే డ్యాన్స్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా కింగ్స్ యునైటెడ్ ఇండియా గ్రూప్ ఈ డ్యాన్స్ చేసింది. సురేశ్ ముకుంద్ కొరియోగ్రఫీ అందించిన ఈ డ్యాన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. వరల్డ్ హిప్ హాప్ చాంపియన్‌షిప్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన తొలి ఇండియన్ టీమ్ ఈ కింగ్స్ యునైటెడ్ ఇండియా గ్రూపే. ఇప్పుడు ఈ టీమ్ చేసిన బాహుబలి డ్యాన్స్ వీడియోను మూడు రోజుల కిందట యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా.. అప్పుడే 16 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోను మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

2265
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS