కాలుష్యంపై వినూత్న ప్ర‌చారం చేప‌ట్టిన ర‌ష్మిక‌

Fri,December 14, 2018 11:24 AM
This Actress Did an Underwater Photoshoot

ఛ‌లో, గీతా గోవిందం, దేవ‌దాసు చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన ర‌ష్మిక మందాన కాలుష్యంపై ప్ర‌జల‌లో అవ‌గాహ‌న క‌లిపించేందుకు వినూత్న ప్ర‌చారం చేప‌ట్టింది. బెంగ‌ళూర్‌లోని బేలండూర్ స‌ర‌స్సు కాలుష్యానికి కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. ఆ స‌రస్సు ప‌రిస‌ర ప్రాంతానికి వెళ్లి ఫోటో షూట్ చేయాల‌ని భావించిన ర‌ష్మిక‌కి ఆ స‌రస్సుని చూసే స‌రికి హృద‌యం విరిగినంత ప‌నైంద‌ట‌. దీంతో వెంట‌నే ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న క‌లిపించేందుకు స‌రస్సులో దిగి ఫోటో షూట్ చేసింది. స‌న్మ‌తి డి ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ఫోటో షూట్ జ‌ర‌గ‌గా, ఆ చిత్రాలు ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సుని క‌దిలిస్తున్నాయి. ఇలాంటి కాలుష్యం ప్ర‌తి చోటా ఉంది. వాటిని నిర్మూలించేందుకు ప్ర‌య‌త్నాలు చేయండ‌ని ర‌ష్మిక ఈ సంద‌ర్భంగా తెలియ‌జేసింది. ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ చిత్రంతో పాటు ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది ఈ అమ్మ‌డు.1526
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles