హీటు పెంచిన అమలాపాల్ ..!

Sat,August 5, 2017 02:44 PM
Thiruttuppayale 2 first look

తన భర్త ఎ.ఎల్ విజయ్ తో విడాకుల తర్వాత అమలాపాల్ జోరుకు అడ్డుకట్టలు లేకుండా పోయాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు గ్లామర్ విషయంలో ఎలాంటి నిబంధనలు పెట్టుకున్నట్టు కనిపించడం లేదు. తన తాజా చిత్రం తిరుట్టుపయలే-2 కాగా, ఈ మూవీ పోస్టర్ ఒకటి రీసెంట్ గా విడుదలైంది . ఇందులో వర్షంలో తడుస్తూ బాబీ సింహతో ఉన్నఅమ‌లా రొమాంటిక్ ఫోజు హాట్ టాపిక్ గా మారింది. పదకొండేళ్ల కిందట తమిళంలో వచ్చిన ‘తిరుట్టుపయలే’ సినిమా లో జీవన్, మనోజ్ కే జయన్, అబ్బాస్, మాళవిక, సోనియా అగర్వాల్ లు ముఖ్య పాత్రల్లో నటించారు. తమిళంలో హిట్టైన ఆ సినిమా తెలుగు, కన్నడలో కూడా రీమేక్ అయ్యింది. ఈ భాషలలో ఆ సబ్జెక్ట్ కి సరైన ఫలితం రాలేదు. ఇప్పుడు తమిళంలో ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందుతుండగా త్వరలోనే మూవీ విడదులకు ప్లాన్ చేశారు. ఇది పక్కా ఆడియన్స్ ని అలరిస్తుందని అంటున్నారు.

4254
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles