మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న చిత్రం అల .. వైకుంఠపురుమలో. జనవరి 12న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు. థమన్ స్వరపరచిన సాంగ్స్‌ని ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ మూవీపై భారీ హైప్స్ క్రియేట్ చేస్తున్నారు. సామజవరగమనా.., రాములో రాములో.. అనే సాంగ్స్ ఇప్పటికే విడుదల కాగా, వీటికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు బాలల దినోత్సవం సందర్భంగా చిత్రం నుండి మూడో సాంగ్ విడుదల చేశారు. ఓ మై గాడ్ డాడీ అంటూ సాగే ఈ పాటలో అల్లు అయాన్, అల్లు అర్హాలు సందడి చేశారు. నవంబర్ 22న ఫుల్ సాంగ్ విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇక మలయాళములోను ఈ చిత్రం విడుదల కానుండగా అంగు వైకుంఠపురత్తు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. చిత్రంలో సుశాంత్, నివేదా పెతురాజ్, టబు ప్రధాన పాత్రలలో సందడి చేయనున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి