ప‌హిల్వాన్‌గా సుదీప్ లుక్ అదిరింది

Wed,July 10, 2019 01:01 PM
Theme Song from Pahilvan released tomorrow

ఈగ‌, బాహుబ‌లి వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన క‌న్న‌డ న‌టుడు సుదీప్. ప్ర‌స్తుతం ఈ న‌టుడు ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ప‌హిల్వాన్ అనే చిత్రం చేస్తున్నాడు. స్వప్న కృష్ణ పహిల్వాన్‌ నేతృత్వంలో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో కిచ్చ సుదీప్‌ పహిల్వాన్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం ప‌లు కసరత్తులు సైతం చేశారు సుదీప్. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. తొలిసారిగా సుదీప్‌ ఈ సినిమాలో కుస్తీ వీరునిగా, బాక్సర్‌గా అభిమానులను అలరించబోతున్నారు. ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కబీర్‌ దుహాన్‌సింగ్‌ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. స్టంట్స్‌ కోసం హాలీవుడ్‌ నుంచి లార్వెన్‌ సోహైల్‌ అనే నిపుణున్ని కూడా పిలిపించారు. అర్జున్ జ‌న్యా సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగులో ప‌హిల్వాన్ అనే టైటిల్ తో విడుద‌ల కానుంది. ఆ మ‌ధ్య మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. కిల్లింగ్ లుక్స్ లో రియ‌ల్ పైల్వాన్‌లా సుదీప్ ఉన్నాడ‌ని చిరు అన్నారు. వ‌చ్చాడ‌య్యో ప‌హిల్వాన్ అనే సాంగ్‌ని రేపు సాయంత్రం 6.30ని.ల‌కి విడుద‌ల చేయ‌నున్నట్టు పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది చిత్ర బృందం. ఆ పోస్ట‌ర్‌లో సుదీప్ లుక్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

1328
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles