న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం మారిన చిత్ర టైటిల్

Wed,March 27, 2019 09:07 AM
The title of Ajay Devgn's film Taanaji has been changed

బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గణ్ మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ సైన్యంలో సేనాధిపతిగా ఉన్న సుబేదార్ తానాజీ మలుసరే జీవితం ఆధారంగా ‘తానాజీ : ది అన్ సంగ్ వారియర్’ అనే చిత్రాన్ని చేస్తున్నట్టు అప్ప‌ట్లో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే . భారత చరిత్రలో కీర్తించని యుద్ధవీరుడు సుబేదార్‌ తానాజీ మలుసరే. తన ప్రజలు, తన నేల తల్లి, తన రాజు ఛత్రపతి శివాజీ కోసం ఎంతగానో పోరాడారు తానాజీ. ఆయ‌న జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఓమ్ రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్న అజ‌య్ దేవ‌గణ్‌ ఈ సినిమాను ‘బాహుబలి’ కన్నా గొప్ప స్థాయిలో చేయాల‌ని అనుకుంటున్నామ‌ని తెలిపాడు. అయితే తాజాగా త‌న చిత్రం ‘తన్హాజీ’ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానున్న‌ట్టు త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు అజ‌య్. న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం తానాజీ అనే టైటిల్ త‌న్హాజీగా మార్చార‌ని టాక్‌. అజయ్‌ దేవగన్, భూషణ్‌ కుమార్, క్రిషన్‌ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజ‌య్ లుక్ ఇప్ప‌టికే విడుద‌ల కాగా, ఈ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు పెంచింది.

2116
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles