ఆస్కార్‌కి వెళ్ళిన ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’ స్టోరీ లైన్ ఇదే..!

Sat,September 22, 2018 01:01 PM
the story line of village rockstars

అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా జ‌రిగే అవార్డుల ఫంక్ష‌న్ ఆస్కార్ వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 24న జ‌ర‌గ‌నుంది. 91వ ఆస్కార్ అవార్డులకి గాను భార‌త్ నుండి 28 చిత్రాలు కాగా ఇందులో అసోం చిత్రం విలేజ్ రాక్‌స్టార్స్ నామినేషన్‌కి ఎంపకైంది. ఉత్త‌మ విదేశీ భాషా చిత్రం కేట‌గిరీలో ఎంపికైన ఈ చిత్రం రీమాదాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా, 2017లో టోరంటో ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ప్రీమియ‌ర్ జ‌రుపుకుంది. 2018లో ఉత్తమ ఫీచ‌ర్ సినిమాగా స్ద‌ర్ణ క‌మ‌ల్‌ జాతీయ అవార్డు అందుకుంది. బెస్ట్ చైల్డ్, బెస్ట్ లొకేష‌న్ సౌండ్ రికార్డిస్ట్‌, బెస్ట్ ఎడిటింగ్ విభాగాల‌లోను ఈ చిత్రం జాతియ అవార్డుల‌ని అందుకుంది. బ‌నిత దాస్‌, మ‌న‌బేంద్ర దాస్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన విలేజ్ రాక్ స్టార్స్ చిత్రం ఓ మారుమూల ప‌ల్లెటూరికి చెందిన అమ్మాయి ఎన్నో క‌ష్టాల‌ని అధిగ‌మించి రాక్‌స్టార్‌గా ఎలా ఎదిగింది అన్న నేప‌థ్యంలో తెర‌కెక్కింది. ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’ ఆస్కార్ నామినేష‌న్‌కి ఎంపిక కావ‌డం ప‌ట్ల చిత్ర బృందం హ‌ర్షం వ్య‌క్తం చేస్తుంది.

ప‌దేళ్ళ ధును(బ‌నిత దాస్‌ అనే ఓ అమ్మాయి మారుమూల ప‌ల్లెటూరు ప్రాంతం అయిన అస్సాంలోని చాయ‌గావ్ గ్రామంలో నివ‌సిస్తుంది. ఆమె త‌ల్లి ( బ‌సంతీ దాస్‌) వీడో కాగా, అన్న‌య్య మ‌ణ‌బెద్ర (మాన‌బెంద్ర దాస్‌) ధునుతో క‌లిసి జీవ‌నం కొన‌సాగిస్తుంటారు. అయితే ఓ రోజు కార్య‌క్ర‌మంలో ధును త‌ల్లికి సాయంగా తినుబండారాలు అమ్మేందుకు వెళ్ళింది. ఆ ఈవెంట్‌లో జ‌రిగిన‌ బ్యాండ్ ప్ర‌ద‌ర్శ‌న ధునుని మంత్ర‌ముగ్ధుల‌నియ్యేట్టు చేసింది. సంగీత వాయిద్యాల‌తో బాయ్స్ హిట్ చేయ‌డం చూసిన ధును వారిని అనుక‌రించేందుకు ప్ర‌య‌త్నించింది. అదే స‌మ‌యంలో కొంత చిరాకుగా ఉన్న ధును ఒక హాస్య పుస్త‌కాన్ని చ‌దివి తాను వాస్త‌వ సాధ‌నాల‌తో రాక్‌బ్యాండ్‌ను తయారు చేయాలని నిర్ణయించు కుంటుంది. అయితే పేదరికం కారణంగా కనీసం గిటార్‌ని కూడా కొనుక్కోలేని స్థితిలో ఉంటుంది.

గిటారు కొనుక్కునేందుకు తాను సంపాదించిన మొత్తాన్ని కొద్ది కొద్దిగా దాచుకుంటుంది. అయితే ఒక రోజు వార్తా ప‌త్రిక‌లో వ్యాసం చ‌దివిన ఆమెకి మ‌నం సానుకూలంగా ఆలోచిస్తే గిటారును త‌ప్ప‌క స్వాధీనపరుచుకుంటాం అని న‌మ్మ‌కం వ‌స్తుంది. కాని అంత‌లోనే వ‌ర‌ద‌లు వారి పంట‌ల‌ని నాశ‌నం చేయ‌డ‌మే కాక ధును న‌మ్మ‌కాన్ని హ‌రిస్తుంది. ఇటువంటి విపత్కర పరిస్థితులను సైతం ఎదుర్కొని ధును తన కల నెరవేర్చుకుంది, లక్ష్య సాధనలో ధును పడిన ఇబ్బందులేమిటి?, పేదరికానికి, విపత్కర పరిస్థితులకు, ధును కలకు మధ్య ఎలాంటి సంఘర్షణ జరిగిందనేది వెండితెరపై అద్భుతంగా చూపించారు. ధును పాత్రలో భనితాదాస్‌ అద్భుతమైన భావోద్వేగాలను పలికించింది.

1824
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles