అనుష్క 'నిశ‌బ్ధం' ఫ‌స్ట్ లుక్‌కి టైం ఫిక్స్

Fri,July 19, 2019 09:10 AM
The Silence will be broken soon

భాగ‌మ‌తి చిత్రం త‌ర్వాత అనుష్క న‌టిస్తున్న చిత్రం సైలెన్స్‌. తెలుగులో ఈ చిత్రం నిశ‌బ్ధం పేరుతో విడుద‌ల కానుంది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అమెరికాలో ఎక్కువ భాగం చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. తెలుగు, త‌మిళం, హిందీతో పాటు ప‌లు భాష‌ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మాధవన్‌ హీరోగా న‌టించ‌నుండ‌గా, అంజలి, షాలినిపాండే, అవ‌స‌రాల శ్రీనివాస్, సుబ్బ‌రాజు, హాలీవుడ్‌ స్టార్‌ మైఖెల్‌ మ్యాడసన్‌ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఇది సస్పెన్స్, థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనుందని సమాచారం. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం కార్పొరేష‌న్ సంస్థ‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఇటీవ‌ల అనుష్క ఇన్‌స్టాగ్రామ్ ద్వారా త‌న లుక్‌ని కొద్దిగా రివీల్ చేసిన విష‌యం విదిత‌మే. పూర్తి లుక్‌ని త్వ‌ర‌లో విడుద‌ల చేస్తామ‌ని పేర్కొంది. ప్రీ లుక్‌లో అనుష్క షార్ట్ హెయిర్‌తో చేతిలో బుక్ ప‌ట్టుకొని రాస్తున్న‌ట్టుగా కనిపిస్తుంది. ‘త్వరలో స్పాట్‌లైన్‌లోకి వస్తాను’ అని స్వీటీ త‌న ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. అయితే తాజాగా మేకర్స్ జూలై 21న చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో అభిమానుల‌లో చ‌ర్చులు మొద‌లు అయ్యాయి. ఇందులో అనుష్క లుక్ ఎలాంటి ఉంటుంది, ఫ‌స్ట్ లుక్‌లో అనుష్కతో పాటు ఎవ‌రెవ‌రి పాత్ర‌లు రివీల్ చేయ‌నున్నార‌నే ఆలోచ‌న‌లు చేస్తున్నారు.

966
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles