దీపిక ప్యాంట్ ఖ‌రీదు తెలిస్తే నోరెళ్ళ‌పెట్టాల్సిందే..!

Thu,July 26, 2018 01:36 PM
The Price Tag On Deepika Padukone Leather Pants Will Burn A Hole In Your Heart

ఒక్కోసారి సెల‌బ్రిటీలు ధ‌రించే దుస్తులు లేదా వారు వాడే వ‌స్తువుల ధ‌ర తెలిస్తే మ‌న గుండెల్లో రైళ్ళు ప‌రిగెత్త‌డం స‌హ‌జం. ఇటీవ‌ల గ్లోబ‌ల్ భామ ప్రియాంక చోప్రా త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా వైట్ డ్రెస్ ధ‌రించింది. దీని ధ‌ర అక్ష‌రాల‌ 1,86,660రూపాయలు. ఇప్పుడు ఫ్యాష‌న్ ఐకాన్ దీపిక ప‌దుకొనే ఖ‌రీదైన ప్యాంట్ ధ‌రించి వార్త‌ల‌లో నిలిచింది. లండన్‌, ఢిల్లీలో గల మేడమ్ టుస్సాడ్స్‌లో దీపికాపదుకొనే మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గాను ఇటీవ‌ల టుస్సాడ్స్ ప్ర‌తినిధులు కొల‌తలు తీసుకున్నారు. ఆ స‌మ‌యంలో వైట్ టాప్ ధ‌రించిన దీపిక లెద‌ర్‌ ప్యాంట్ ధ‌రించింది. డిజైనర్ ద్వయం లాజరో హెర్నాండెజ్ మరియు జాక్ మెక్కోలౌ ఈ బెల్ట్ వ‌రుస‌లా ఉన్న ప్యాంట్‌ని డిజైన్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ప్యాంట్ మూడు రంగుల‌లో ల‌భ్య‌మ‌వుతుంది. ప్రోయొంజా స్కౌల‌ర్ అనే వెబ్ సైట్ ఈ ప్యాంట్‌ని విక్రయానికి పెట్టింది. దీని అస‌లు ధ‌ర మూడు వేల ఎనిమిది వంద‌ల ముప్పై తొమ్మిది కాగా, డిస్కౌంట్ ధ‌ర 1,334 డాల‌ర్లు. అంటే మ‌న లెక్క‌ల ప్ర‌కారం రెండు ల‌క్ష‌ల అర‌వై మూడు వేల ఐదు వంద‌ల ఇర‌వై ఎనిమిది రూపాయ‌లు. లండ‌న్‌లోని మేడ‌మ్ టుస్సాడ్స్‌కి వెళ్లిన స‌మయంలో ఖరీదైన ప్యాంట్‌తో పాటు టామ్ ఫోర్డ్ షూస్, లెద‌ర్ లెగ్గింగ్స్‌, తోలు బెల్ట్ బ్యాగ్ ధరించింది. ప్ర‌స్తుతం దీపికా ధ‌రించిన దుస్తుల‌పై హాట్ హాట్ చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. చివ‌రిగా ప‌ద్మావ‌తి చిత్రంలో న‌టించిన దీపికా త్వ‌ర‌లో నాగ్పాడాకు చెందిన మాఫియా క్వీన్ రహీమా ఖాన్ జీవితమాధారంగా సినిమా చేయ‌నుంది.

✈️ #London

A post shared by Deepika Padukone (@deepikapadukone) on


5056
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles