మ‌రో రెండు రోజుల‌లో సైరా టీజ‌ర్ విడుద‌ల‌

Sun,August 18, 2019 12:14 PM
The much awaited  SyeRaa Teaser in 2 days

మెగాస్టార్ చిరంజీవి కెరియ‌ర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నాడు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నాడు. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, జ‌గ‌ప‌తి బాబు వంటి టాప్ స్టార్స్ న‌టిస్తున్నారు. అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా చిత్రం విడుద‌ల కానుంద‌నే టాక్ వినిపిస్తుంది. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌తో పాటు డీఐ వర్క్ జ‌రుపుకుంటుంది.

చిత్రంలో బ్రిటీష్ అధికారులకు, నరసింహారెడ్డికీ మధ్య జరిగే అతి కీలకమైన ఒప్పందాలకి సంబంధించిన స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తాయ‌ని అంటున్నారు. రీసెంట్‌గా చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో క‌త్తుల‌తో పాటు సినిమాకి సంబంధించిన ఆయుధాల‌ని చూపించారు . ఇక చిరు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్ర టీజ‌ర్‌ని ఆగ‌స్ట్ 20న విడుద‌ల చేయ‌నున్నారు. మ‌రో రెండు రోజుల‌లో చిత్ర టీజ‌ర్ విడుద‌ల కానుండ‌డంతో దీని కోసం అభిమానులు క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు.

1098
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles