ఎక్కువ మంది మెచ్చిన తెలుగు పాట ఇదే : బ‌న్నీ

Sun,October 20, 2019 09:28 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం అల‌.. వైకుంఠ‌పుర‌ములో. సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి సామ‌జవ‌ర‌గ‌మ‌నా.. అనే సాంగ్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. క్లాసికల్ మ్యూజిక్ కి వెస్ట్రన్ టచ్ ఇచ్చి థమన్ స్వరపర‌చిన‌ ఈ సాంగ్ ప్రేక్షకులకు అమితంగా నచ్చేసింది. యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు 41 మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకున్న ఈ పాట 7 లక్షల లైక్స్ ను యూట్యూబ్ లో దక్కించుకుంది. తెలుగులో ఓ పాట‌కి ఇన్ని లైక్స్ రావ‌డం ఇదే తొలిసారి అంటున్నారు. ఈ విష‌యాన్ని అల్లు అర్జున్ కూడా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. ఎక్కువ మంది లైక్ చేసిన తెలుగు పాట ఇది. మీ ప్రేమ‌కి ధ‌న్యావాదాలు అని పోస్ట్ పెట్టారు బ‌న్నీ. సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాట‌కి తగిన న్యాయం చేసాడ‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్‌ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

2462
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles