అనుష్కతో తిట్లు తిన్న వ్య‌క్తి కూడా న‌టుడే..!

Tue,June 19, 2018 01:10 PM
The man Anushka Sharma slammed for littering is Shah Rukh Khan

కొంద‌రికి సెల‌బ్రిటీ స్టేట‌స్ ఎప్పుడు ఎక్క‌డ నుండి ఎలా వ‌స్తుందో ఎవ‌రికి తెలియ‌దు. ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది రాత్రికి రాత్రే స్టార్ స్టేట‌స్‌ని పొందుతున్నారు. తాజాగా అనుష్క‌తో చీవాట్లు తిన్న అర్హాన్ సింగ్ సెల‌బ్రిటీ అయిపోయాడు. అనుష్క ఇటీవ‌ల త‌న భర్త‌తో క‌లిసి కారులో వెళ్తుండగా పక్కనే కారులో ప్రయాణిస్తున్న అర్హాన్ సింగ్ అనే వ్యక్తి రోడ్డుపై ప్లాస్టిక్ కవర్‌ను విసిరేశాడు. దాన్ని గమనించిన అనుష్క శర్మ కారును ఆపి మరీ అర్హాన్ సింగ్‌కు క్లాస్ పీకింది. ''రోడ్డుపై ప్లాస్టిక్ కవర్‌ను ఎందుకు పారేస్తున్నారు, అలా చేయరాదు, డస్ట్ బిన్‌ను వాడండి..'' అంటూ అనుష్క శర్మ కొంచెం గట్టిగానే అర్హాన్ సింగ్‌పై కేకలు వేసింది. దీనిని కోహ్లీ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో దీనిపై ప‌లువురు ప‌లు ర‌కాలుగా స్పందించారు. కొంద‌రు అనుష్కకి మ‌ద్ద‌తిస్తే మ‌రి కొంద‌రు అత‌నిని అంత‌గా మంద‌లించ‌డం స‌రికాదు అని అన్నారు.

అయితే కోహ్లి వీడియోతో సోష‌ల్ మీడియాలో స్టార్‌డం అందుకున్న అర్హాన్ సింగ్ తాను ఓ న‌టుడినే అనే విష‌యాన్ని షారూఖ్‌తో దిగిన ఫోటో పోస్ట్ చేసి తెలిపాడు. షారూఖ్‌తో క‌లిసి ప‌ని చేయ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని క్యాప్ష‌న్ ఇచ్చాడు. మాధురీ దీక్షిత్‌ నటించిన ‘రాజా’, షాహిద్‌ కపూర్‌ నటించిన ‘పాఠశాల’ చిత్రాల్లోనూ అర్హాన్‌ చిన్న పాత్రల్లో నటించారు. అనుష్క ప్ర‌స్తుతం షారూఖ్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న జీరో చిత్రంలో న‌టిస్తుంది. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘జీరో’ చిత్రంలో షారూఖ్ మ‌రుగుజ్జుగా క‌నిపించ‌నున్నాడు.

Disclaimer: i have no desire to gain any mileage from this post of mine... Horrible! So I happened to carelessly Litter a sq mm of plastic while driving ! A car passing by rolls their window down and there we have our wonderful @anushkasharma ranting and yelling like a crazy roadside person! While I’m apologetic for my carelessness , Mrs Anushka Sharma Kohli a little etiquette and politeness in ur dialogue wouldn’t have made u a lesser star !! There are all kinds of manners and hygiene .. verbal etiquette is one of them ! The garbage that mistakenly went out of the window of my "luxury car"... Was way less then the garbage that came out from your mouth... From ur "luxury car's" window... Or the trashy mind @virat.kohli to shoot and post this online... For whatever gains... Now thats some serious trash!!!

A post shared by Arhhan Singh (@arhhansingh) on

1135
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles