రికార్డ్ వ్యూస్ సాధించిన ది ల‌య‌న్ కింగ్ చిత్ర ట్రైల‌ర్

Tue,November 27, 2018 12:37 PM
The Lion King reaches record views

వాల్ట్ డిస్నీ సంస్థ నుండి వ‌చ్చిన యానిమేష‌న్ చిత్రాలు సిండ్రెల్లా, ద జంగ‌ల్ బుక్, బ్యూటీ అండ్ ద బీస్ట్‌లు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకోగా, ఇప్పుడు అదే సంస్థ నుండి ద ల‌య‌న్ కింగ్ అనే చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 1994లో వ‌చ్చిన యానిమేష‌న్ చిత్రం ద ల‌య‌న్ కింగ్‌కి ఉన్న‌త ప్ర‌మాణాలు జోడించి 3డీ యానిమేష‌న్‌లో చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. జోన్ ఫావ్రే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలోని పాత్ర‌లకు హాలీవుడ్ టాప్‌ స్టార్స్ డబ్బింగ్ అందించారు. రీసెంట్‌గా ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులో స‌న్నివేశాలు యానిమేష‌న్ ల‌వ‌ర్స్ ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు సెల‌బ్రిటీలకి కూడా ఈ చిత్ర ట్రైలర్ న‌చ్చ‌డంతో వారు విప‌రీతంగా షేర్ చేశారు. ఈ చిత్ర ట్రైల‌ర్‌కి 24 గంటల్లోనే దాదాపు 22 కోట్ల గ్లోబల్‌ వ్యూస్‌ వచ్చాయి. ఈ విష‌యాన్ని డిస్నీ సంస్థ సోష‌ల్ మీడియా ద్వారా వెల్లడించింది. డిస్నీ సంస్థ రూపొందించిన చిత్రాల‌న్నింటిలో ఈ చిత్ర ట్రైల‌ర్‌ని ఎక్కువ మంది వీక్షించ‌డం విశేషమ‌ని వారు అన్నారు. ప్ర‌స్తుతం నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం జూలై 19, 2019న విడుద‌ల కానుంది.

1723
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles