'ద ల‌య‌న్ కింగ్' అఫీషియ‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల‌

Fri,November 23, 2018 12:06 PM
The Lion King Official Teaser Trailer released

డిస్నీ సంస్థ నుండి వ‌చ్చిన యానిమినేష‌న్ చిత్రాలు సిండ్రెల్లా, ద జంగ‌ల్ బుక్, బ్యూటీ అండ్ ద బీస్ట్‌లు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకోగా, ఇప్పుడు అదే సంస్థ నుండి ద ల‌య‌న్ కింగ్ అనే చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 1994లో వ‌చ్చిన యానిమేష‌న్ చిత్రం ద ల‌య‌న్ కింగ్‌కి ఉన్న‌త ప్ర‌మాణాలు జోడించి 3డీ యానిమేష‌న్‌లో చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. జోన్ ఫావ్రే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలోని పాత్ర‌లకు హాలీవుడ్ టాప్‌ స్టార్స్ డబ్బింగ్ అందించారు. రీసెంట్‌గా ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులో స‌న్నివేశాలు యానిమేష‌న్ ల‌వ‌ర్స్ ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు సెల‌బ్రిటీలకి కూడా ఈ చిత్ర ట్రైలర్ న‌చ్చ‌డంతో వారు విప‌రీతంగా షేర్ చేస్తున్నారు. నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం జూలై 19, 2019న విడుద‌ల కానుంది. విడుద‌లైన కొద్ది స‌మ‌యంలోనే చిత్ర ట్రైలర్ 4 మిలియ‌న్స్‌కి పైగా వ్యూస్ రాబ‌ట్టింది. ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

1299
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles