83 కోసం భారీ కాస్టింగ్‌.. రిలీజ్ డేట్ ఫిక్స్

Wed,January 23, 2019 10:48 AM
The Huge Cast Of 83 To Be Revealed  soon

లెజండ‌రీ క్రికెట‌ర్ క‌పిల్ దేవ్ బ‌యోపిక్ 83 అనే టైటిల్‌తో రూపొంద‌నుండ‌గా, ఈ చిత్రం క‌బీర్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది . ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. 1983 వరల్డ్‌కప్ ఫైనల్లో అప్పటి డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ టీమ్ సక్సెస్ స్టోరీ ఆధారంగా మూవీ తెరకెక్క‌నుంది. హిందీ, తెలుగుతో పాటు పలు భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్‌కి కోచ్ గా నటించనున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ వీడియో ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేస్తూ అతి త్వ‌ర‌లో చిత్రానికి సంబంధించిన భారీ కాస్టింగ్ ప్ర‌క‌టించ‌నున్నామ‌ని తెలిపారు. 2020లో ఏప్రిల్ 10 గుడ్ ఫ్రైడే రోజు క‌పిల్ దేవ్ బ‌యోపిక్ చిత్రంని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు కూడా తెలిపారు. ఈ చిత్రాన్ని రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించ‌నుంది. క‌పిల్ దేవ్ పాత్ర‌లో న‌టించ‌బోతున్న ర‌ణవీర్ సింగ్ ప్ర‌స్తుతం గ‌ల్లీ బాయ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు.2045
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles