అలీ చేసిన త‌ప్పిదానికి డిస్ క్వాలిఫై అయిన శివ‌జ్యోతి

Thu,October 3, 2019 08:14 AM

బిగ్ బాస్ సీజ‌న్ 3 ఎపిసోడ్ 74లో ఇంటి సభ్యుల‌కి కుళాయి కొట్లాట అనే టాస్క్ ఇచ్చారు. బ్యాటిల్ మెడాలియ‌న్ మొద‌టి లెవ‌ల్‌లో భాగంగా జ‌రిగిన ఈ టాస్క్‌లో వితికా, శ్రీముఖి, శివ‌జ్యోతి, బాబా భాస్క‌ర్, అలీ పాల్గింటారని బిగ్ బాస్ తెలిపారు. పున‌ర్న‌వి సంచాల‌కురాలిగా వ్య‌వ‌హ‌రించింది.టాస్క్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన ట్యాపుల నుండి వ‌చ్చే వాట‌ర్‌ని బ‌కెట్స్‌లో నింపుకొని ప‌క్క‌న ఉన్న కంటైన‌ర్స్‌లో పోయాల్సి ఉంటుంది. ఎవ‌రైతే ఎక్కువ నీళ్ళు నింపుతారో వారు డైరెక్ట్‌గా బ్యాటిల్ మెడాలియన్‌కు డైరెక్ట్‌గా ఎంపిక అవుతార‌ని బిగ్ బాస్ బాస్ పేర్కొన్నారు.


టాస్క్‌లో పాల్గొన‌ని ఇంటి స‌భ్యులు గేమ్ ఆడేవారి నీళ్ళ‌ని ప‌డేయోచ్చు. వారికి సాయం చేయ‌వ‌చ్చు, అడ్డుకోవ‌చ్చు అని చెప్ప‌డంతో ఆట ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. ఒక ట్యాప్ ద‌గ్గ‌ర శ్రీముఖి, శివ‌జ్యోతి, వితికా నీళ్ళ కోసం పోటి ప‌డితే మ‌రో ట్యాప్ ద‌గ్గ‌ర అలీ రెజా, బాబా భాస్క‌ర్ కుస్తీలు ప‌డ్డారు. బాబా భాస్క‌ర్ నీళ్ళు వ‌రుణ్ ప‌డేస్తుండ‌డంతో వారిద్ద‌రి మ‌ధ్య కొద్ది సేపు చ‌ర్చ జ‌రిగింది. దీనిపై సంచాల‌కురాలిగా ఉన్న పున‌ర్న‌వి క్లారిటీ ఇచ్చింది. కొద్ది సేప‌టి త‌ర్వాత అలీ రెజా, శ్రీముఖి మ‌ధ్య కూడా వాదోప‌వాదాలు జ‌రిగాయి.

అలీ రెజా త‌న గేమ్ తాను ఆడ‌కుండా శివ‌జ్యోతి కోసం ఆడుతున్నాడ‌ని శ్రీముఖి ఆరోపించింది. అందుకు కార‌ణం అలీ రెజా త‌ను తెచ్చిన నీళ్ళ‌ని శివ‌జ్యోతి కంటెన‌ర్స్‌లో పోస్తుండ‌డం. నీ ఆట నువ్ ఆడటం మానేసి శివజ్యోతికి హెల్ప్ చేయడం ఏంటి? ఆమె కోసం టైటిల్ వదిలేస్తావా అని శ్రీముఖి ఫైర్ అయింది. దీనికి ధీటుగా బ‌దులిచ్చిన అలీ.. అవును వదిలేస్తా అన్నాడు . ఇలా దీనిపై డిస్క‌ష‌న్ జ‌రుగుతున్న స‌మ‌యంలో బిగ్ బాస్ త‌న నిర్ణ‌యాన్ని తెలిపాడు. నియ‌మాల‌ని ఉల్లంఘించిన కార‌ణంగా శివ‌జ్యోతి, అలీ రెజాలు ఈ టాస్క్ నుండి డిస్ క్వాలిఫై అయిన‌ట్టు తెలిపారు.

జ్యోతి, అలీ డిస్ క్వాలిఫై కావ‌డంతో శ్రీముఖి, బాబా భాస్క‌ర్, వితికా గేమ్‌లో పాల్గొన్నారు. చివ‌రికి వితికా కంటైన‌ర్‌లో ఎక్కువ నీళ్ళు ఉండ‌డంతో ఆమెని విజేత‌గా ప్ర‌క‌టించింది పున‌ర్న‌వి. కుళాయి కొట్లాట టాస్క్‌లో విజేతగా నిలిచిన కార‌ణంగా బ్యాటిల్ మెడాలియన్‌కు డైరెక్ట్‌గా ఎంపిక అయ్యింది వితికా. ఈ గేమ్‌కి సంబంధించి మ‌రి కొన్ని లెవ‌ల్స్ ఉండ‌గా, అవి నేటి ఎపిసోడ్స్‌లో ప్ర‌సారం కానున్న‌ట్టు తెలుస్తుంది.

5219
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles