మిస్టర్ ఫ్రాగ్‌కు బంగారు ఏనుగు

Tue,November 14, 2017 10:44 PM
The Golden Elephant 2017 By Children's Film Society India

హైదరాబాద్ : 40 థియేటర్లు... 317 చిత్రాలు.. 3 లక్షల మంది చిన్నారులు... వెరసి చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్. వారం రోజుల పాటు లక్షలాది మంది చిన్నారులను అలరించిన 20వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం శిల్పకళావేదికలో అట్టహాసంగా ముగిసింది.ఈ ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజేతలకు బంగారు ఏనుగు ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల ఆసక్తులను గుర్తించి వారిని పోత్సహించాలని, చదువుల పేరుతో పిల్లలపై ఒత్తిడి పెంచడం సరైంది కాదని అన్నారు. చిత్రోత్సవంలో అంతర్జాతీయ లైఫ్ యాక్షన్ విభాగంలో నెదర్లాండ్‌కు మిస్టర్ ఫ్రాగ్ చిత్రం, లిటిల్ డైరెక్టర్స్ విభాగంలో చైనీస్ చిత్రం ది గ్రోసరీ స్టోర్ ఆఫ్ డ్రీమ్ బంగారు ఏనుగును గెలుచున్నాయి. కాగా ఏషియన్ పనోరమా విభాగంలో భారతీయ చిత్రం స్టాంప్ ఆల్బమ్‌కి బంగారు ఏనుగు దక్కింది. ఈ కార్యక్రమంలో సినీ తారలు యామి గౌతమ్, శ్రద్ధా కపూర్, బజరంగ్ బాయిజాన్ ఫేమ్ హర్షాలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్నారులు ఆటపాటలతో అలరించారు. ఫెస్టివల్ డైరెక్టర్ శ్రవణ్‌కుమార్, సినిమాటోగ్రఫీ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌకిక్, జ్యూరీ చైర్మన్ అమల తదితరులు పాల్గొన్నారు.

బంగారు ఏనుగు దక్కించుకున్న చిత్రాలు
విభాగం చిత్రం
ఇంటర్నేషనల్ లైఫ్ యాక్షన్ ఫీచర్ మిస్టర్ ఫ్రాగ్ (నెదర్లాండ్)
ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫీచర్ ఫాంటమ్ బాయ్ (ఫ్రాన్స్)
ఇంటర్నేషనల్ షార్ట్స్ లైవ్ యాక్షన్ మీడియం (ఇండియా)
ఇంటర్నేషనల్ షార్ట్స్ యానిమేషన్ మై లైఫ్ ఐ డోంట్ వాంట్ (మయన్మార్)
ఏషియన్ పనోరమా ఫీచర్ హౌరా (ఫీచర్)
ఏషియన్ పనోరమా షార్ట్స్ స్టాంప్ ఆల్చమ్ (ఇండియా)
లిటిల్ డైరెక్టర్స్ ది గ్రోసరి స్టోర్ ఆఫ్ డ్రీమ్ (థైవాన్)

745
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS