సుధీర్ బాబు తాజా చిత్రం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Fri,June 29, 2018 11:34 AM
The First Look Of Sudheer Babu Nannu Dochukunduvate

యంగ్ హీరో సుధీర్ బాబు ఇటీవ‌ల స‌మ్మోహ‌నం చిత్రంతో బిగ్గెస్ట్ హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌లోను ప‌లు చిత్రాలు చేసిన ఆయ‌నకి స‌రైన గుర్తింపు ల‌భించ‌లేదు. ఇంద్రగంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కించిన స‌మ్మోహ‌నం చిత్రంతో సుధీర్ బాబుకి ప్ర‌త్యేక గుర్తింపు వ‌చ్చింది. ఇప్పుడు ఆయ‌న త‌దుప‌రి చిత్రాల‌పై అభిమానుల‌లో ఆస‌క్తి పెరిగింది. ప్ర‌స్తుతం ఈ హీరో ఆర్ ఎస్ నాయుడు ద‌ర్శ‌క‌త్వంలో న‌న్ను దోచుకుందువటే అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ తాజాగా విడుద‌లైంది. ఈ పోస్ట‌ర్ ఫ్యాన్స్‌లో సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తుంది. న‌బా న‌టేష్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇటీవ‌ల సొంత ప్రొడ‌క్ష‌న్ హౌజ్ స్థాపించిన సుధీర్ బాబు త‌న నిర్మాణ సంస్థ‌లో తొలి చిత్రంగా నన్ను దోచుకుందువ‌టే సినిమా చేస్తున్నాడు. చిత్రంలో సుధీర్ బాబు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం.లోక్‌నాథ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం కూడా మంచి విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉంది చిత్ర బృందం.


1320
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS