మ‌ణికర్ణిక మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Wed,August 15, 2018 09:32 AM
The first look of  Manikarnika released

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఝాన్సీ లక్ష్మీబాయి కథతో క్రిష్ తెరకెక్కించిన‌ చిత్రం మణికర్ణిక- ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఆమె చూపిన వీరపరాక్రమం గురించి సినిమాలో అద్భుతంగా చూపించ‌నున్నార‌ట‌. చిత్రాన్ని స్వాతంత్య్ర‌దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌తో విడుద‌ల చేయాలని ముందుగా భావించారు. కాని వీఎఫ్ఎక్స్‌కి సంబంధించిన వ‌ర్క్ పూర్తి కాక‌పోవ‌డంతో జ‌న‌వ‌రి 25న సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు చిత్రానికి సంబంధించిన పిక్స్ లీక్ కాగా, ఈ రోజు ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో కంగనా వీర ప‌రాక్ర‌మంతో గుర్రంపై స్వారీ చేస్తున్న‌న‌ట్టుగా ఉంది. ఇది ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. సంగీత త్రయం శంకర్- ఎహసాన్- లాయ్ లు సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. మ‌ణిక‌ర్ణిక‌కి పోటీగా సూపర్ 30 విడుద‌ల కానున్న‌ట్టు స‌మాచారం

1442
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS