మ‌రోసారి 'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌'ని తెర‌పైకి తెచ్చిన వ‌ర్మ‌

Wed,December 19, 2018 01:46 PM

కొన్నాళ్ళ క్రితం టాలీవుడ్‌లో ఎన్టీఆర్ బ‌యోపిక్ రూపొందించేందుకు పలువురు ద‌ర్శ‌కులు క‌స‌ర‌త్తులు చేసిన సంగతి తెలిసిందే. ముందుగా క్రిష్.. ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళ‌గా జ‌న‌వ‌రి 9న క‌థానాయకుడు చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. రెండోపార్ట్ కూడా జ‌న‌వ‌రి నెల‌లోనే విడుద‌ల కానుంది. అయితే సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ కూడా ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని తెర‌కెక్కిస్తాన‌ని ప్ర‌క‌టించిన త‌ర్వాత పోస్ట‌ర్ మాత్ర‌మే విడుద‌ల చేశాడు. ఆ త‌ర్వాత చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వ‌లేదు. తాజాగా ఈ సినిమాలో వెన్నుపోటు అనే పాట ఫస్ట్‌లుక్‌ను డిసెంబర్‌ 21 సాయంత్రం రిలీజ్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు వర్మ. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తోనే సంచ‌ల‌నం సృష్టించిన వర్మ.. ఇప్పుడు వెన్నుపోటు పోస్టర్‌నుఎలా డిజైన్ చేశాడా అనే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత చోటు చేసుకున్న సంఘటనలతో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాను వర్మ తెరకెక్కిస్తున్నారు. ముంబై వ్యాపారవేత్త బాలగిరికి చెందిన జీవీ ఫిల్మ్స్‌ సంస్థ సమర్పిస్తోన్న సినిమాను రాకేశ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.2605
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles