వ‌రుణ్‌కి నిజామాబాద్ ఫ్యాన్ కాల్‌.. అవాక్క‌యిన శ్రీముఖి

Wed,October 30, 2019 08:06 AM

బిగ్ బాస్ సీజ‌న్ 3 వందో ఎపిసోడ్‌లో యాంక‌ర్ సుమ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి హౌజ్‌మేట్స్‌తో సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌వారం ఎపిసోడ్‌లోను సుమ సంద‌డి కొన‌సాగింది. ఇంటి స‌భ్యుల‌తో స‌ర‌దాగా మాట్లాడుతూ, జోకులు వేస్తూ వారిలో జోష్‌ని పెంచింది. అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో బెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌రుణ్ సందేశ్‌ని సుమ ఎంపిక చేయ‌డంతో, అత‌ను ఫ్యాన్ తో కాల్ మాట్లాడే అవకాశం పొందాడు .


నిజామాబాద్ నుండి ర‌వి అనే వ్య‌క్తి కాల్ చేసి .. వ‌రుణ్‌, మీ ఎనర్జీ త‌గ్గిన‌ట్టు అనిపిస్తుంది. వితికా వెళ్లినందున డ‌ల్ అయ్యారా అని ప్ర‌శ్నించాడు. సుమ మీరు ఎక్క‌డి నుండి కాల్ చేస్తున్నారు అని ఫ్యాన్‌ని ప్ర‌శ్నించ‌గా, తాను నిజామాబాద్ అని చెప్పే సరికి నిజామాబాద్ ప్రాంతానికి చెందిన శ్రీముఖి అవాక్క‌యింది. అనంతరం ఇంటి స‌భ్యుల‌కి ఫ్యాన్స్ పంపిన మెసేజ్‌ల‌ని చ‌దివి వినిపించారు. వ‌రుణ్‌తో పాటు మిగ‌తా స‌భ్యులంద‌రు త‌మకి వ‌చ్చిన మెసేజ్‌ల‌ని చ‌ద‌వ‌గా, కొంద‌రు తిడుతూ పొగిడారు. ఊస‌ర‌వెల్లి అని, న‌క్క అని కూడా వారు త‌మ ట్వీట్స్‌లో పొందుప‌ర‌చారు.

ఇక కొద్ది సేప‌టి త‌ర్వాత సుమ ఇంటి స‌భ్యుల‌తో క‌లిసి దీపావ‌ళి వేడుక జ‌రుపుకుంది. క్రాక‌ర్స్ కాల్చి ఒక‌రికొరు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసుకున్నారు. తాను వెళ్ళేముందు ఎవ‌రెవ‌రు ఎలా గేమ్ ఆడుతున్నారు. రానున్న రోజుల‌లో ఎలా ఉండాలి, గేమ్ ఎలా ఆడాలి అనే విష‌యాల‌ని ప‌ర్స‌న‌ల్‌గా పిలిచి చెప్పింది సుమ‌. తాను యాంక‌ర్‌గా కాకుండా ప్రేక్ష‌కుల త‌ర‌పున చెబుతున్నాను అని సుమ స్ప‌ష్టం చేసింది.

ఇంటి స‌భ్యుల జాత‌కం చెప్పేందుకు బ‌య‌ట నుండి ఓ జ్యోతిష్కురాలిని ఇంట్లోకి పంపారు బిగ్ బాస్. బాబా భాస్క‌ర్ ముందుగా ఆమె ద‌గ్గ‌ర‌కి వెళ్లి త‌న జాత‌కం చెప్పించుకున్నాడు. ఆ త‌ర్వాత మిగ‌తా ఇంటి స‌భ్యులు కూడా క్యూ క‌ట్టారు. ఈ ప్ర‌క్రియ ముగిసిన త‌ర్వాత రాహుల్ గుల్ గుల్ అవుతుంది బిగ్ బాస్ అంటూ ఓ పాట పాడి ఇంటి స‌భ్యుల‌తో పాటు ప్రేక్ష‌కుల‌ని న‌వ్వించాడు. మొత్తానికి 101వ ఎపిసోడ్ కూడా స‌ర‌దాగా సాగ‌గా, నేటి ఎపిసోడ్‌లో ఎలాంటి ఆస‌క్తిక‌ర అంశాలు ఉంటాయో చూడాలి.

11920
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles