వీడియోతో విష‌యం చెప్పిన టాక్సీవాలా

Tue,May 1, 2018 12:41 PM
The Dream Behind Taxiwaala video released

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో అందరి దృష్టి ఆకర్షించిన విజయ్ దేవరకొండ త్వరలో ట్యాక్సీవాలా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవ‌ల‌ ఫస్ట్ గేర్ అంటూ మూవీ టీజర్ విడుదల చేసిన‌ చిత్ర బృందం , కొద్ది రోజుల క్రితం మ‌రో టీజ‌ర్ విడుద‌ల చేసింది. వీటికి మంచి రెస్పాన్స్ రావ‌డంతో పాటు సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగాయి. అయితే కొద్ది సేప‌టి క్రితం మేక‌ర్స్ ది డ్రీమ్ బిహైండ్ టాక్సీవాలా పేరుతో ఓ వీడియో విడుద‌ల చేశారు. చిత్రం క్లీన్ అండ్ నీట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని వీడియో చూస్తుంటే అర్ధ‌మ‌వుతుంది. జీఏ2 పిక్చర్స్ మరియు యూవీ క్రియేషన్స్ బేనర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టాక్సీ డ్రైవర్ చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుందని తెలుస్తుంది. చిత్రంలో షార్ట్ ఫిలింస్ బ్యూటీ ప్రియాంక జవల్కర్ ,మాళవిక నాయర్ లు హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో శివ పాత్రలో టాక్సీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. రాహుల్ సంకృతియన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 18న విడుదల కానుంది. ప్ర‌స్తుతం ఈ మూవీ నిర్మాణాంత‌ర కార్యక్ర‌మాలు జ‌రుపుకుంటుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ చివ‌రిగా ఏ మంత్రం వేశావే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ ల‌భించింది.


2163
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles