త‌మ‌న్నా చిత్రానికి వివాదాలు త‌ప్ప‌వా ?

Sun,February 3, 2019 07:54 AM
That Is Mahalakshmi To Be In Controversy

కంగన రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చారిత్రాత్మక చిత్రం మణికర్ణిక చిత్రం కొద్ది రోజులుగా ప‌లు వివాదాల‌తో హాట్ టాపిక్‌గా న‌లుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను 70 శాతం తానే రూపొందించానని కంగన క్రెడిట్ తీసుకోవడంతో దర్శకుడు క్రిష్ ఇటీవల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కంగనపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ మూవీ రూట్లోనే త‌మ‌న్నా ద‌టీజ్ మ‌హాల‌క్ష్మీ చిత్రం వివాదాల‌తో హాట్ టాపిక్‌గా నిలుస్తుందా అనే దానిపై అభిమానుల‌లో చ‌ర్చ జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ జ‌రుపుకుంటున్న ద‌టీజ్ మహాల‌క్ష్మీ చిత్రానికి మొద‌ట నీల‌కంఠ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప‌లు కార‌ణాల వ‌ల‌న ప్రాజెక్ట్ మ‌ధ్య‌లోనే ఆయ‌న త‌ప్పుకున్నాడు. మిగ‌తా భాగాన్ని ప్ర‌శాంత్ విహారి పూర్తి చేసాడు. అయితే సినిమా రిలీజ్ అప్పుడు టైటిల్స్‌లో ద‌ర్శ‌కుడిగా నీల‌కంఠ‌, ప్ర‌శాంత్ విహారి ఇద్ద‌రి పేర్లు వేస్తారా లేదా అనే దానిపై సందిగ్ధత నెల‌కొంది. టైటిల్స్ లో ఏ ఒక్క‌రి పేరు తొల‌గించిన మ‌ణిక‌ర్ణిక మాదిరిగా ఈ చిత్రం చుట్టూ వివాదాలు నెల‌కొనడం ఖాయ‌మంటున్నారు విశ్లేష‌కులు.

3231
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles