టీజ‌ర్‌తో అల‌రించేందుకు సిద్ధ‌మైన త‌మ‌న్నా

Sun,December 16, 2018 07:01 AM
That Is Mahalakshmi teaser released on dec 21

బాలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ క్వీన్.. సౌత్ లోని నాలుగు భాషలలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. హిందీలో కంగనా రనౌత్ పోషించిన పాత్రని తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో పరుల్ యాదవ్ లు పోషిస్తున్నారు. క్వీన్ రీమేక్ చిత్రం కన్నడలో బటర్ ఫ్లై అనే టైటిల్‌తో తెరకెక్కుతుండగా, తమిళంలో పారిస్ పారిస్, మలయాళంలో జామ్ జామ్, తెలుగులో దటీజ్ మ‌హాల‌క్ష్మీ అనే టైటిల్స్ తో రూపొందుంది. తెలుగు వ‌ర్షెన్‌ని అ చిత్ర ఫేం ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ట్ చేయ‌గా, కన్న‌డ వ‌ర్షెన్‌ని ర‌మేష్ అర‌వింద్‌, మ‌ల‌యాళ వ‌ర్షెన్‌ని నీల‌కంఠ‌, త‌మిళ వ‌ర్షెన్‌ని కూడా రమేష్ అరవింద తెర‌కెక్కిస్తున్నాడు. ప్ర‌స్తుతం అన్ని భాష‌ల‌కి సంబంధించి షూటింగ్ ప్ర‌క్రియ పూర్తి కాగా, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలని వేగవంతం చేశారు. అతి త్వ‌ర‌లోనే చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నుకుంటున్నారు. అయితే డిసెంబ‌ర్ 21న చిత్ర టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు టీం పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. నార్త్‌లో మంచి హిట్ కొట్టిన ఈ చిత్రం సౌత్‌లోని అన్ని భాష‌ల‌లోను సూప‌ర్ డూప‌ర్ విజ‌యం సాధించ‌డం ఖాయం అంటున్నారు.

1194
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles