గుమ్మ‌డికాయ కొట్టిన తెలుగు క్వీన్

Sat,July 28, 2018 09:31 AM
That Is Mahalakshmi shooting completed

బాలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ క్వీన్ సౌత్ లోని నాలుగు భాషలలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. హిందీలో కంగనా రనౌత్ పోషించిన పాత్రని తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో పరుల్ యాదవ్ లు పోషిస్తున్నారు. క్వీన్ రీమేక్ చిత్రం కన్నడలో బటర్ ఫ్లై అనే టైటిల్‌తో తెరకెక్కుతుండగా, తమిళంలో పారిస్ పారిస్, మలయాళంలో జామ్ జామ్ అనే టైటిల్స్ తో రూపొందుంది. బాలీవుడ్ చిత్రం 'క్వీన్' ను నిర్మాత త్యాగరాజన్ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందిస్తున్నారు. తమిళ, కన్నడ భాషల్లో రమేష్ అరవింద్ రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. తెలుగు వ‌ర్షెన్‌కి సంబంధించి అ ఫేం ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించాడు. చివ‌రి షెడ్యూల్ యూరప్‌లో తెర‌కెక్కించిన టీం తాజాగా గుమ్మ‌డికాయ కొట్టింది. ద‌టీజ్ మ‌హాల‌క్ష్మీ చిత్రం పూర్తైంద‌ని తాజాగా చ‌క్క‌ర్లు కొడుతున్న ఫోటోని చూస్తే అర్ధం అవుతుంది. ఈ మూవీలో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ మేల్ లీడ్ చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌గా అల‌రిస్తుందని టీం చెబుతుంది. ఇదిలా ఉంటే చిత్రంలో లీడ్ రోల్ ప్లే చేస్తున్న త‌మ‌న్నా ప్ర‌స్తుతం ఎఫ్ 2 అనే మ‌ల్టీ స్టార‌ర్ లో వెంకీ స‌ర‌స‌న న‌టిస్తుంది. దీంతో పాటు కునాల్ కోహ్లి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమాతో పాటు చిరంజీవి సైరా, హిందీలో ఖామోషి, త‌మిళ్‌లో క‌న్నె క‌లైమాని అనే సినిమాలు చేస్తుంది.

2876
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles