నేనలా అనలేదు.. ఇంటర్వ్యూని కావాలనే అలా ఎడిట్ చేశారు!

Mon,November 19, 2018 03:29 PM
That Interview edited to be insensitive says Preity Zinta

మీటూ ఉద్యమంపై తాను అనుచిత వ్యాఖ్యలు చేశానన్న విమర్శలపై బాలీవుడ్ నటి ప్రీతి జింటా స్పందించింది. బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో మీటూ బాధితులను అవమానించేలా మాట్లాడినట్లు ఆమెపై విమర్శలు వచ్చాయి. అయితే ఆ ఇంటర్వ్యూని కావాలనే అలా ఇష్టం వచ్చినట్లు ఎడిట్ చేశారని, తాను నిజానికి అలా మాట్లాడలేదని ఆమె ట్వీట్ చేసింది. ఇంటర్వ్యూ చేసిన సదరు జర్నలిస్ట్ ఫరీదూన్ షహర్యార్‌పై ఆమె తీవ్రంగా మండిపడింది. అదే రోజు తాను మరో 25 ఇంటర్వ్యూలు ఇచ్చానని, ఎక్కడా లేకుండా ఇందులో మాత్రమే అలా ఎందుకు వచ్చిందని ప్రీతి ప్రశ్నించింది. ఈ ఇంటర్వ్యూ చూసి తాను చాలా అసంతృప్తికి గురైనట్లు ఆమె చెప్పింది. తనకూ మీటూ అనుభవం ఎదురైతే బాగుండేదని, మీకు సరైన సమాధానం ఇచ్చేదానని ప్రీతి అన్నట్లుగా ఆ ఇంటర్వ్యూలో ఉంది. అంతేకాదు మీటూ బాధితులను అవమానించేలా.. మిమ్మల్ని అవతలివాళ్లు ఎలా చూడాలని అనుకుంటున్నారో అలాగే వాళ్లు చూస్తారు అని ఆమె అనడం సంచలనం రేపింది.


3752
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles