'సంజు' డైరెక్ట‌ర్‌తో భేటి అయిన త‌రుణ్ భాస్క‌ర్‌

Wed,July 4, 2018 12:21 PM
Tharun Bhascker meets Rajkumar Hirani in mumbai

బాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొడుతున్న ద‌ర్శ‌కుడు రాజ్ కుమార్ హిరాణీ. మున్నాభాయ్ ఎంబీబీఎస్‌, `ల‌గేర‌హో మున్నాభాయ్‌`, `త్రీఇడియెట్స్‌`, `పీకే`.. తాజాగా `సంజు` వంటి సినిమాల‌తో వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్‌లు సాధించారు. సంజూ చిత్రం సంజ‌య్ ద‌త్ బ‌యోపిక్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌గా, ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు తిర‌గరాస్తుంది. ఈ చిత్ర విజ‌యం రాజ్ కుమార్ హిరాణీకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. ప్ర‌స్తుతం ఈ మూవీ స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న రాజ్‌కుమార్ హిరాణీనిని పెళ్లి చూపులు ద‌ర్శకుడు తరుణ్ భాస్క‌ర్ క‌లిసారు. త‌రుణ్ తెర‌కెక్కించిన తాజా చిత్రం ఈ న‌గ‌రానికి ఏమైంది ముంబైలో స్పెష‌ల్ స్క్రీనింగ్ జ‌రుపుకుంది. దీనికి హిరాణీనిని కూడా ఆహ్వానించారు. ఈ క్ర‌మంలో త‌రుణ్ భాస్క‌ర్‌, రాజ్ కుమార్ హిరాణీ క‌లిసి ఫోటోకి ఫోజులిచ్చారు. ఆ త‌ర్వాత ఫ్యూచ‌ర్‌లో తాను తెర‌కెక్కించ‌బోవు సినిమాల‌కి సంబంధించి చ‌ర్చ‌లు జరిపారు త‌రుణ్‌. ఈ న‌గ‌రానికి ఏమైంది చిత్రం త‌క్కువ బడ్జెట్‌తో యూత్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే.

1733
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles