ర‌వితేజ 'అఅఅ' చిత్రం అద్భుతంగా వ‌చ్చింది

Sun,July 22, 2018 01:00 PM
thaman tweets on aaa movie

బెంగాల్ టైగర్ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ర‌వితేజ ఇటీవ‌ల‌ రాజా ది గ్రేట్‌, టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు అనే చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక ప్ర‌స్తుతం శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రం చేస్తున్నారు. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రంతో ఇలియానా టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తుంది. ద‌స‌రా కానుక‌గా మూవీ విడుద‌ల కానుంది. ఇందులో ర‌వితేజ మూడు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. కొద్దిరోజులుగా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్ర ర‌ష్‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ చూశార‌ట‌. అఅఅ సినిమా చాలా వినోద భ‌రితంగా ఉంది. విజువ‌ల్స్ స్టన్నింగ్‌గా ఉన్నాయి. శ్రీను వైట్ల మరోసారి ఆకాశ‌మే హ‌ద్దు అని చూపించారు. సూప‌ర్ ఎనర్జీతో అల‌రించేందుకు ర‌వితేజ రాబోతున్నారంటూ థ‌మ‌న్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. థ‌మ‌న్ ట్వీట్‌తో అభిమానుల‌లో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెరిగాయి. శ్రీను వైట్ల- ర‌వితేజ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన వెంకీ, దుబాయ్ శీను చిత్రాలు భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

మ‌రో ప‌క్క సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్నారు ర‌వితేజ‌. ఈ చిత్రంలో కాజల్‌, కేథరిన్‌ కథానాయికలుగా న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా , ఒక్క క్షణం ‘చిత్రాల దర్శకుడు వి .ఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలోను ఓ మూవీ చేయ‌నున్నాడు ర‌వితేజ‌. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి డిస్కో రాజా అనే టైటిల్ పరిశీలనలో ఉండ‌గా, ఇందులో ద్విపాత్రిభిన‌యం పోషించ‌నున్నాడ‌ట మాస్ రాజా. అందులో ఒకటి కొడుకు పాత్ర కాగా మరొకటి తండ్రి పాత్ర అని తెలుస్తుంది .


5151
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles