సైరా టీజర్ స్కోరు నాదే అని ఒప్పుకున్న థమన్

Wed,August 23, 2017 10:29 AM
thaman confirms back ground score of syeraa

ఎన్ని రోజుల నుండో చిరు 151వ చిత్ర మూవీ ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిన్న సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు రామ్ చరణ్. చిత్రానికి సైరా.. నరసింహరెడ్డి అనే టైటిల్ ఫిక్స్ చేసి మూవీ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ రివీల్ చేశాడు. వీటితో పాటు పాత్రలని పరిచయం చేస్తూ ఓ వీడియోని రూపొదించి విడుదల చేశారు. అయితే మోషన్ పోస్టర్ వీడియోలో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించాయి. ఏఆర్ రెహమాన్ అదరగొట్టాడని ప్రశంసలు కురిపించారు. కట్ చేస్తే బ్యాక్ గ్రౌండ్ స్కోరు అందించింది థమన్ అని తేలింది.

సైరా.. నరసింహరెడ్డి చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి మొదట చిరు 151 వ చిత్రానికి థమన్ నే సంగీత దర్శకుడి గా ఎంచుకున్న సంగతి తెలిసిందే. థమనే స్వయంగా తన ట్విట్టర్ లో సురేందర్ రెడ్డితో దిగిన ఫోటో షేర్ చేస్తూ మరోసారి కలిసి పనిచేయబోతున్నామని అప్పట్లో అన్నాడు. అప్పుడు అందరు చిరు చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడని అనుకున్నారు. అయితే సైరా చిత్రాన్ని నేషనల్ వైడ్ గా రూపొందించాలని భావించడంతో పోస్టర్ రిలీజ్ కి కొద్ది రోజుల ముందు థమన్ ని తప్పించి ఏఆర్ రెహమాన్ ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసారని తెలుస్తుంది. అయితే మోషన్ పోస్టర్ కి మ్యూజిక్ అందించే సమయం రెహమాన్ కి లేకపోవడంతో చెర్రీ, సురేందర్ రెడ్డి ఇద్దరు థమన్ ని ఒప్పించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టించారట. ఈ విషయాన్ని థమన్ ట్విట్టర్ లో తెలిపాడు. ప్రస్తుతం థమన్ పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తుంది.పాత ట్వీట్

3230
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles