ధోని కోసం థ‌మ‌న్ త్యాగం..!

Fri,July 7, 2017 06:24 PM

ఇండియా మాజీ కెప్టెన్ , జార్ఖండ్ డైన‌మైట్ మ‌హేంద్ర సింగ్ ధోని 36వ బ‌ర్త్ డే నేడు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కి టీంమేట్స్ తో పాటు అభిమానులు , కుటుంబ స‌భ్యులు విషెస్ తెలిపారు. ఇక క్రికెట్ ని ప్రాణంగా ప్రేమించే టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ కి స్పెష‌ల్ గా బ‌ర్త్ డే విషెస్ చెప్పాడు. థ‌మ‌న్ కి చిన్న‌ప్ప‌టి నుండే క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇప్ప‌టికి క్రికెట్ ఆడేందుకు చెన్నై నుండి హైద‌రాబాద్ కి వ‌స్తాడ‌ట‌. అయితే ఈ రోజు మిస్ట‌ర్ కూల్ బ‌ర్త్ డే కావ‌డంతో త‌న ట్విట్ట‌ర్ లో వెరైటీ విషెస్ అందించాడు థ‌మ‌న్ . ఈ సంగీత ద‌ర్శ‌కుడు ఇప్ప‌టి వ‌ర‌కు త‌న ట్విట్ట‌ర్ లో 9999 ట్వీట్స్ చేయ‌గా, 10000వ ట్వీట్ ధోని కోస‌మే చేయాల‌ని అనుకున్నాడ‌ట‌. అందుకే గ‌త 6 రోజుల నుండి ట్విట్టర్ జోలీకే వెళ్ళ‌లేద‌ట‌. ఈ రోజు ధోని బ‌ర్త్ డే కావ‌డంతో ఆయ‌న స్కెచ్ ఫోటో ఒక‌టి షేర్ చేసి ఇది నా 10000వ ట్వీట్.. ఇది ఎం.ఎస్ ధోనికి డెడికేట్ చేస్తున్నాను అని అన్నాడు.2287
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles