సంచలన ప్రకటనతో షాకిచ్చిన పైరసీ వెబ్ సైట్

Sun,September 24, 2017 11:15 AM
సంచలన ప్రకటనతో షాకిచ్చిన పైరసీ వెబ్ సైట్

ఈ రోజుల్లో సినీ పరిశ్రమకు పెద్ద గుదిబండగా మారింది పైరసీ భూతం. సినిమా రిలీజ్ కాకమందే పైరసీ నెట్‌లో ప్రత్యక్షం అవుతుంది. ముఖ్యంగా కోలీవుడ్‌ లో పైరసీ వెబ్ సైట్స్ ఆగడాలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. నిర్మాతల సంఘం అధ్యక్షుడు విశాల్‌ పైరసీని తుదముట్టించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న వీరి ఆగడాలకు హద్దు ఉండడం లేదు. తాజాగా తమిళ రాకర్స్ అనే వెబ్ సైట్ సంస్థ విజయ్ నటించిన మెర్సల్ సినిమాని రిలీజైన 15 రోజలకి తమ సైట్ లో ఉంచుతామని సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుతం తమ సైట్ కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, త్వరలోనే వాటిని రికవర్ చేసి రీ ఎంట్రీ ఇస్తామని ఆ వెబ్ సైట్ వెల్లడించింది. ఇంత ధైర్యంగా తమిళ రాకర్స్ వెబ్ సైట్ సంచలన ప్రకటన చేయడంతో కోలీవుడ్ అంతా ఒక్కసారిగా షాక్ అయింది. గతంలో సూర్య నటించిన సింగం 3 విషయంలోను తమిళ రాకర్స్ ఇలాంటి సంచలన ప్రకటన చేసింది.

8703

More News

VIRAL NEWS