విజ‌య్ 64వ ప్రాజెక్ట్‌పై వ‌చ్చిన క్లారిటీ

Sun,August 25, 2019 07:47 AM
Thalapathy 64 official update

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్ర‌స్తుతం అట్లీ దర్శకత్వంలో త‌న 63వ సినిమాగా బిగిల్ అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీలో కథిర్, యోగిబాబు, రెబా మోనికా జాన్, వివేక్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. `బిగిల్‌`( విజిల్ అనే అర్థం) అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో విజ‌య్ రెండు లుక్స్‌లో క‌నిపించ‌నున్నారు. అందులో ఒక‌టి గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర అయితే.. మ‌రొక‌టి ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ పాత్ర అని తెలుస్తుంది. సంక్రాంతికి ఈ చిత్రం విడుద‌ల కానున్న‌ట్టు స‌మాచారం. క‌ట్ చేస్తే విజ‌య్ 64వ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. లోకేష్ కంగ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ త‌న 64వ సినిమా చేయ‌నుండ‌గా,ఈ చిత్రాన్ని ఎక్స్‌బీ ఫిలిం క్రియేట‌ర్స్ నిర్మించ‌నున్నారు. అనిరుథ్ ర‌విచంద్ర‌న్ స్వ‌ర‌కర్త‌. 2020 స‌మ్మ‌ర్‌లో చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు

1165
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles