బోనీక‌పూర్ నిర్మాణంలో అజిత్ 59వ చిత్రం

Fri,December 14, 2018 01:18 PM
Thala Next Movie Has Officially Launched

త‌ల అజిత్ కోలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రు. విభిన్న పాత్ర‌లతో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న అజిత్ ప్ర‌స్తుతం విశ్వాసం అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. శివ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతుంది. సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. అజిత్ త‌న త‌ర్వాతి చిత్రంగా పింక్ రీమేక్ లో న‌టించ‌నున్నాడని కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జ‌రుగుతుంది. అయితే తాజాగా ఈ చిత్ర పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేశారు. ధీర‌న్ అధికారం ఒండ్రు చిత్ర ఫేం హెచ్ వినోద్ పింక్ చిత్రాన్ని త‌మిళంలో రీమేక్ చేయ‌బోతున్నారు. బోని క‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రిలో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళి, జూన్‌లో రిలీజ్ చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుంద‌ట‌. న‌జ్రియా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించ‌నుంద‌ని అంటున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్ పాత్ర‌ని అజిత్ చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. వీటిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, గ్లామ‌ర్ బ్యూటీ తాప్సీ న‌టించిన పింక్ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొంద‌డ‌మే కాక ప‌లు అవార్డుల‌ని పొందింది. వ్యభిచార గృహాల్లో చిక్కుకున్న ముగ్గురు యువతులను రక్షించే న్యాయవాది ఇతివృత్తంగా తెరకెక్కిన చిత్రం పింక్‌.


1530
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles