వీడియో సాంగ్‌తో అల‌రించిన నాని

Fri,April 6, 2018 07:25 AM
Thaaney Vachhindhanaa Video Teaser released

నేచుర‌ల్ స్టార్ నాని , మేర్ల‌పాక గాంధీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం కృష్ణార్జున యుద్ధం. ఏప్రిల్ 12న విడుద‌ల కానున్న ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. వ‌రుస హిట్స్ మీద ఉన్న నాని త‌న ఖాతాలో మ‌రో హిట్ వేసుకోనున్నాడ‌ని తెలుస్తుంది. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం U/A సర్టిఫికెట్ పొందింది. మూవీ రిలీజ్ టైం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్‌పై దృష్టి సారించారు. చిత్రానికి సంబంధించి ‘‘తానే వచ్చిందనా.. గాలే రంగుల్లో మారేనా.. అరే పల్లె గాలి పిల్లై మారే.. నన్ను ఊపిరల్లే అల్లేనా..’’ అంటూ సాగే పాట వీడియో టీజర్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు. కాలభైరవ, పద్మలత ఆలపించిన ఈ సాంగ్‌కి హిప్ హాప్ త‌మీజా సంగీతం అందించారు. బీచ్ ఒడ్డున తెర‌కెక్కించిన ఈ సాంగ్ సినీ ల‌వ‌ర్స్‌ని ఆక‌ట్టుకుంటుంది. శైన్ స్క్రీన్స్ పతాకంపై గరపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ దిల్లాన్ కథానాయికలుగా నటించారు. చిత్రంలో డ్యూయ‌ల్ రోల్ పోషించిన నాని కృష్ణుడిగా మాస్ పాత్ర‌లో, అర్జున్‌గా రాక్‌స్టార్ పాత్ర‌లో అల‌రించ‌నున్నాడు. తాజాగా విడుద‌లైన సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.

2303
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles