ఇటు క్లాసు అటు మాస్ లుక్‌లో అద‌ర‌గొట్టిన సూర్య - టీజ‌ర్‌

Fri,December 1, 2017 09:53 AM
Thaanaa Serndha Koottam teaser released

ఇటు తెలుగు, అటు త‌మిళంలో మంచి క్రేజ్ ఉన్న న‌టుడు సూర్య‌. ఇటీవ‌ల సింగం 3 చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సూర్య ప్ర‌స్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తానా సెరిందా కూట్టం అనే చిత్రాన్ని చేస్తున్నాడు. యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. ఇందులో రమ్యకృష్ణ, సెంధిల్ ముఖ్య పాత్రలు పోషించగా స్టూడియో గ్రీన్ బేనర్ పై సత్యన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. యంగ్ టాలెంట్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని టీం భావిస్తుండ‌గా, రీసెంట్‌గా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో సూర్య రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. ఇందులో ఒకటి గల్లీలో నివసించే మాస్ యువకుడిగా గడ్డంతో కనిపించాడు. మ‌రో లుక్‌లో సీబీఐ ఆఫీసర్ గా అఫీషియల్ లుక్ లో అదరగొట్టాడు. హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన స్పెషల్ ఛబ్బీస్ సినిమాకు ఇది అఫీషియల్ రీమేక్ కాగా, తెలుగులో గ్యాంగ్ పేరుతో విడుద‌ల కానుంది. యూవీ క్రియేషన్స్ తెలుగు రైట్స్ ద‌క్కించుకున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రి తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి

1512
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles