‘ఏక్ దో తీన్’ సాంగ్ రీమిక్స్‌పై డైరెక్టర్ ఫైర్

Wed,March 21, 2018 07:27 PM
Tezaab director Chandra Fires on ek do teen song Remix


ముంబై: 1988లో వచ్చిన తేజాబ్ చిత్రంలో మాధురీ దీక్షిత్ నర్తించిన ‘ఏక్ దో తీన్’ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సూపర్‌హిట్ సాంగ్‌ను తాజాగా ‘బాఘీ 2’ సినిమాలో రీమేక్ చేశారు. ఏక్ దో తీన్ రీమేక్‌లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ స్టెప్పులేసింది. ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ పాటకు జాక్వెలిన్ చెత్తగా డ్యాన్స్ చేసిందని సోషల్‌మీడియాలో మాధురీదీక్షిత్ అభిమానులు మండిపడుతున్నారు. తేజాబ్ డైరెక్టర్ చంద్ర కూడా ఈ రీమిక్స్ పాటపై తనదైన శైలిలో సెటైర్లు వేశాడు.

శ్రీదేవి సంతాపసభకు వెళ్లినపుడు కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ తనకు రీమిక్స్ సాంగ్ విషయం చెప్పిందని చంద్ర తెలిపాడు. రీమిక్స్ పాట ఎంత అప్‌సెట్ చేసిందో మీకు తెలుసా..?ఏక్ దో తీన్ ఐటమ్ సాంగ్‌కు ఎలా డ్యాన్స్ చేశారో చూశారా..? జాక్వెలిన్ డ్యాన్స్ చూస్తుంటే సెంట్రల్ పార్కును బొటానికల్ గార్డెన్‌గా మార్చినట్లుగా ఉందని సెటైర్లు వేశాడు చంద్ర. ఈ పాటపై తాను, సరోజ్‌ఖాన్ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చంద్ర తెలిపాడు. మాధురీదీక్షిత్, జాక్వెలిన్ సాంగ్స్‌పై మీరూ లుక్కేయండి..2302
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles