టెంప‌ర్ రీమేక్..'తెరె బిన్' వీడియో సాంగ్ విడుద‌ల‌

Fri,December 14, 2018 12:05 PM
tere bin song released from SIMMBA

పూరీ జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన టెంపర్‌కి హిందీలో రీమేక్ ‘సింబా’ . ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్ పోషిస్తుండగా..సారా అలీఖాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అజ‌య్ దేవ్‌గ‌ణ్‌ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో కరణ్‌జోహార్, రోహిత్‌శెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 28న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రంకి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్రమాలు చేప‌ట్టారు. తాజాగా తెరె బిన్ అంటూ సాగే రొమాంటిక్ పాటకి సంబంధించిన వీడియో విడుద‌ల చేశారు. ఈ సాంగ్‌కి ర‌ష్మి విరాగ్ లిరిక్స్ అందించ‌గా, ర‌హ‌త్ ఫాతె అలీ ఖాన్‌, అస్సెస్ కౌర్‌, త‌నిష్క బ‌గ్చీ పాట పాడారు. ఈ సాంగ్‌లో సారా అలీఖాన్ తన అందచందాలతో అందరిని మంత్రముగ్దులను చేస్తోంది. బాలేరావు అనే పోలీసాఫీసర్‌గా రణ్‌వీర్‌సింగ్ నటిస్తోండగా..సోనూసూద్ విలన్‌గా నటిస్తున్నాడు. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి త‌నిష్క బ‌గ్చీ సంగీతం అందిస్తున్నాడు.

2021
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles